టికెట్ ధరలు 80 శాతం తగ్గింపు.. 99కే ‘రామాయణ’ సినిమా చూసే ఛాన్స్.!
Nov 24, 2026 10:51AM

రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 5న విడుదలైన ఈ మూవీ మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. అయితే ఇటీవల వసూళ్ల వేగం కొంత తగ్గడంతో చిత్రబృందం టికెట్ ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రేక్షకులు కేవలం రూ.99కే ఈ సినిమాను చూసే అవకాశం లభిస్తోంది.
సాధారణంగా ఈ సినిమా టికెట్ ధరలు కొన్ని నగరాల్లో రూ.300 నుంచి రూ.400 వరకు ఉన్నాయి. ఇప్పుడు వాటిని భారీగా తగ్గించి రూ.99 నుంచే అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని థియేటర్లలో ఈ తగ్గింపు 50 నుంచి 60 శాతం ఉండగా, మరికొన్ని చోట్ల ఏకంగా 80 శాతం వరకు ధరలు తగ్గినట్లు సమాచారం. 3D, IMAX షోలకు కూడా ధరలు తగ్గినప్పటికీ, వాటి టికెట్లు మాత్రం సాధారణ 2D షోల కంటే ఎక్కువగానే ఉన్నాయి.
నవంబర్ 24న గురు నానక్ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించారు. అయితే ఇది ఒక్కరోజుకే పరిమితం కాకుండా వారంలోని మిగిలిన రోజుల్లోనూ కొన్ని థియేటర్లలో తగ్గించిన ధరలు కొనసాగుతున్నట్లు బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో కనిపిస్తోంది. రీక్లైనర్ సీట్లు, ప్రీమియం ఫార్మాట్లకు మాత్రం వేర్వేరు ధరలు ఉన్నాయి.

ఇక టికెట్ ధరలు తగ్గించడానికి బాక్సాఫీస్ వసూళ్లలో వేగం తగ్గడమే కారణమనే చర్చ జరుగుతోంది. విడుదలైన మొదటి వారంలో భారీ వసూళ్లు సాధించిన ఈ మూవీ.. దీపావళి సెలవుల సమయంలోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే మూడో సోమవారం నాటికి వసూళ్లు తగ్గాయి. నవంబర్ 23న ఇండియాలో సుమారు రూ.12.70 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.
ఇది కూడా చదవండి: వారణాసి వీడియో లీక్.. ఆపిల్ చేసిన పనికి షాక్‌లో రాజమౌళి.!
అయినప్పటికీ సినిమా మొత్తం వసూళ్లు మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నాయి. నవంబర్ 23 నాటికి ఇండియాలో సుమారు రూ.955 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.1,700 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టికెట్ ధరలను తగ్గించడం ద్వారా మరింత మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి భారీ టికెట్ ధరల కారణంగా థియేటర్లకు వెళ్లలేకపోయిన ప్రేక్షకులకు ఈ తగ్గింపు మంచి అవకాశంగా మారింది. మరి రూ.99 టికెట్ ఆఫర్‌తో ‘రామాయణం’ బాక్సాఫీస్ వద్ద మరోసారి వసూళ్ల వేగాన్ని పెంచుకుంటుందా? అనేది చూడాలి.
మీకు నచ్చవచ్చు:
కిరణ్ అబ్బవరం రికార్డ్.. కాన్సెప్ట్ పోస్టర్‌లో ఇన్ని మిస్టరీలా.?
రెండేళ్లుగా ఎదురుచూపులు.. ఎట్టకేలకు ‘దేవర’ శాటిలైట్ రైట్స్ సోనీ చేతికి.!
[Ramayana Ticket Price, Ranbir Kapoor, Yash, Sai Pallavi, Nitesh Tiwari]


