విజయ్ స్థానంలో త్రిష.. TVKలో అసలు ఏం జరుగుతోంది.?
Nov 24, 2026 1:54PM

సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రిష.. త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) తరఫున తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష పోటీ చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు స్థానాల నుంచి విజయం సాధించిన విజయ్.. నిబంధనల ప్రకారం ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో పెరంబూర్ స్థానాన్ని ఉంచుకుని తిరుచ్చి ఈస్ట్‌ను వదులుకున్నారు. ఫలితంగా అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఖాళీ అయిన ఈ స్థానంలో టీవీకే తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో త్రిష పేరు తెరపైకి వచ్చింది. ఆమెను తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయించాలని అభిమానులు, టీవీకే కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కొందరు త్రిష అభిమానులు 'ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై' పేరుతో కొత్త సంస్థను ప్రారంభించడం కూడా ఆమె పొలిటికల్ ఎంట్రీ ప్రచారానికి మరింత ఆజ్యం పోసింది. గతంలో తన పేరుతో రాజకీయ ప్రచారం జరిగినప్పుడు వెంటనే స్పందించే త్రిష.. ఈసారి మాత్రం మౌనంగా ఉండటం చర్చకు కారణమవుతోంది.

మరోవైపు, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి త్రిష పేరును పార్టీలోని కొందరు నేతలు ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ సలహాదారులు ఆమెను నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించడం కంటే రాజ్యసభకు పంపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: బిగ్ సర్‌ప్రైజ్.. ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు మూవీ.!
తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం టీవీకేకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో త్రిష వంటి పాపులర్ సినీ తారను బరిలోకి దింపితే పార్టీకి ప్రచారపరంగా ప్రయోజనం ఉంటుందని కొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ ప్రచారాలన్నీ నిజమవుతాయా? త్రిష నిజంగానే విజయ్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారా? లేక ఆమె పేరు రాజకీయ చర్చలకే పరిమితం అవుతుందా? దీనిపై టీవీకే అధిష్ఠానం నుంచి వచ్చే అధికారిక ప్రకటనే స్పష్టత ఇవ్వనుంది.
మీకు నచ్చవచ్చు:
శ్రీవిష్ణుపై నాని ఫ్యాన్స్ ఫైర్.. మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.!
టికెట్ ధరలు 80 శాతం తగ్గింపు.. 99కే రామాయణ సినిమా చూసే ఛాన్స్.!
[Trisha Politics, TVK Candidate, Tiruchirappalli East, By Election, CM Vijay]



