TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

శ్రీవిష్ణుపై నాని ఫ్యాన్స్‌ ఫైర్.. మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.!

Nov 24, 2026 12:18PM

శ్రీవిష్ణు సినిమాల్లో కామెడీ ఉండటం ఎంత కామనో.. ఇతర హీరోల సినిమాలపై సెటైర్లు ఉండటం కూడా అంతే కామన్ అయిపోయింది. ఇటీవల ఈ డోస్ మరింత పెరిగింది. 

శ్రీవిష్ణు లాస్ట్ మూవీ 'కామ్రేడ్ కళ్యాణ్'లో పలు సినిమాలపై సెటైర్లు వేశారు. వాటిలో 'ప్యారడైజ్, ఆచార్య' సినిమాలపై వేసిన సెటైర్లు బాగా హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా చనిపోయిన కాకిని చూపిస్తూ 'ప్యారడైజ్ కాకి' అనే డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ పై నాని ఫ్యాన్స్ అప్పుడే ఫైర్ అయ్యారు. 

అలాగే అందులో ఆచార్య మూవీపై కూడా సెటైర్ ఉంది. ఒక సీన్లో 'నీదే దళం 'అని నక్సలైట్ నాయకుడు అడిగితే.. "ఆచార్య దళం. అది పాదఘట్టానికి, ధర్మస్థలికి మధ్యలో ఉంటుంది" అని శ్రీవిష్ణు అంటాడు. అయితే ఈ డైలాగ్ గురించి ముందే మెగాస్టార్ కి చెప్పామని శ్రీవిష్ణు చెప్పినప్పటికీ.. చాలామంది మెగా ఫ్యాన్స్ ఈ డైలాగ్ కి హర్ట్ అయ్యారు.

ఇక తన నెక్స్ట్ మూవీ 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్‌లోనూ ఇతర హీరోల సినిమాలపై సెటైర్లు వేసి ఫ్యాన్స్ ను మరోసారి ట్రిగ్గర్ చేశాడు శ్రీవిష్ణు. ముఖ్యంగా ఈ టీజర్‌లో మళ్ళీ 'ప్యారడైజ్'ను టార్గెట్ చేశాడు. టీజర్ చివర్లో "గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు రాయండి.. ఫన్ ఉండాలి, జోష్ ఉండాలి, కిక్ ఉండాలి" అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. 

ఇది కూడా చదవండి: ఫ్యామిలీ ప్యాక్ టీజర్‌.. శ్రీ విష్ణు నాన్ స్టాప్ పంచ్‌లు.!

'ప్యారడైజ్'లో హీరో గుర్తింపు కోసం పోరాడతాడు. ఇలాంటి గుర్తింపు కథలను ఇక ఆపండి అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు దానినే పట్టుకొని "గుర్తింపు కథలు వద్దురా" అంటూ శ్రీవిష్ణు సెటైర్ వేయడం నాని అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

గతేడాది శ్రీవిష్ణు నటించిన 'సింగిల్' సినిమాలో కూడా 'ప్యారడైజ్ కాకి' డైలాగ్ ఉంటుంది. 'ప్యారడైజ్' గ్లింప్స్ లోని డైలాగ్ ను రీక్రియెట్ చేస్తూ.. "నీలాంటి కాకుల గురించి ఎక్కడా రాయలేదురా" అంటాడు. 

ఇలా ప్యారడైజ్ ను టార్గెట్ చేస్తూ శ్రీవిష్ణు పదే పదే డైలాగ్స్ పేల్చడంపై నాని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నవ్వించడం తప్పులేదు కానీ, ఇలా ఒక సినిమాని అదే పనిగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని విరుచుకుపడుతున్నారు.

మరోవైపు 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్‌లో మెగా ఫ్యాన్స్ ను కూడా హర్ట్ చేశాడు శ్రీవిష్ణు. "కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్ రిపోర్టింగ్ సార్" అంటూ ఆవేశంగా డైలాగ్ చెబుతాడు. అయితే ఆ డైలాగ్ స్టాలిన్ సినిమాలో "మేజర్ స్టాలిన్ రిపోర్టింగ్ సార్" అనే డైలాగ్ ను గుర్తు చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్ చూసి మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

శ్రీవిష్ణు సినిమాల్లో కామెడీని అందరి హీరోల ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అయితే ఇలా పదే పదే ఇతర హీరోల సినిమాల మీద సెటైర్లు వేయడం వల్ల.. ఆయా హీరోల ఫ్యాన్స్ శ్రీవిష్ణు సినిమాలకు దూరమయ్యే ప్రమాదముంది. మరి ఈ విషయాన్ని గుర్తించి రాబోయే సినిమాల్లోనైనా ఇతర హీరోల ఫ్యాన్స్ ని హర్ట్ చేయని కామెడీతో వస్తాడేమో చూడాలి.

మీకు నచ్చవచ్చు:
వారణాసి వీడియో లీక్.. ఆపిల్ చేసిన పనికి షాక్‌లో రాజమౌళి.!
బిగ్ సర్‌ప్రైజ్‌.. ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు మూవీ.!

 

 

 

[Sree Vishnu Comedy, Family Pack Teaser, Nani Paradise, Chiranjeevi, Stalin Movie]

 

google-ad-img