
రామ్ పోతినేని హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా #RAPO23. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనగా.. తాజాగా మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ఈ సినిమాలో భాగమైనట్లు మేకర్స్ ప్రకటించారు. దసరా సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోను కూడా పంచుకున్నారు.
రామ్ పోతినేని కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇప్పటివరకు నటుడిగా ప్రేక్షకులను అలరించిన రామ్.. ఈసారి దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కథను కూడా ఆయనే సిద్ధం చేయడం విశేషం. ఈ సినిమాలో వీర అనే పాత్రలో కనిపించనున్నారు. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వోల్ఫ్’ అనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కుతోంది.
ఇక రితేశ్ దేశ్‌ముఖ్ చేరికతో ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తి పెరిగింది. ఆయన ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించనున్నారు? రామ్ పోతినేనితో ఆయన తలపడే సన్నివేశాలు ఉంటాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే రితేశ్ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించాల్సి ఉంది.

హిందీ, మరాఠీ సినిమాల్లో నటించి తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రితేశ్ దేశ్‌ముఖ్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. రితేశ్ ఎవరో కాదు.. హాసినిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన జెనీలియా భర్త కావడం విశేషం. 2008 లో వచ్చిన 'రెడీ' సినిమాలో రామ్ సరసన జెనీలియా నటించగా.. ఇప్పుడు ఆమె భర్త రామ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిర్రు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, డార్క్ విజువల్ టోన్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ద్వారా తెలుస్తోంది. రామ్ సోదరుడు కృష్ణ పోతినేని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఇది కూడా చదవండి: 'భగవంత్ కేసరి'కి మూడేళ్లు.. బాలయ్య కెరీర్లో స్పెషల్ మూవీ.!
[Riteish Deshmukh Joins RAPO23, Ram Pothineni, RAPO23 Movie, Riteish Deshmukh, Genelia Deshmukh, Ready Movie, Genelia D'Souza, Samyuktha Menon, Telugu Film News]






