Home

»

Latest News

ఊహకందని క్రియేటివిటీ: డోంట్ మిస్.. ఏ ఓటిటిలో ఉందంటే!! 

Oct 19, 2026 12:16PM

 

సరైన సినిమా చూస్తే వచ్చే మజానే వేరు. పై పెచ్చు ఊహకందని, అంటే ఇలా కూడా సినిమా తీయచ్చా అంటూ అడుగడుక్కి ఉద్వేగపూరితమైన, ఉత్కంఠ కొలిపే సన్నివేశాలు వస్తుంటే ఇంకేమైనా ఉందా? నా అంత అదృష్టవంతుడు ఈ లోకంలోనే లేడనుకోవడం ప్రేక్షకుడు వంతవుతుంది. ఇప్పుడు  'బేబీ డు డై డు' మూవీ చూసిన వాళ్ళ  పరిస్థితి అదే!

బాలీవుడ్ ప్రసిద్ధ నటి హుమా ఖురేషి టైటిల్ రోల్ పోషించ క్రైమ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో  'బేబీ డు డై డు' (Baby Do Die Do) తెరకెక్కింది. ఇప్పుడు ఈ మూవీ  ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సరిగ్గా మూడు నెలల క్రితం, అంటే గత జూలై 3వ తేదీన భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 7.45 కోట్ల నెట్ కలెక్షన్లను మాత్రమే రాబట్టింది. అలియా భట్ నటించిన 'అల్ఫా' సినిమాతో గట్టి పోటీ ఎదురుకావడం వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెరవలేకపోయింది. అయినప్పటికీ, విమర్శకుల నుంచి సానుకూల సమీక్షలను దక్కించుకున్న ఈ సినిమా, సెప్టెంబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.


ఈ సినిమా ప్రధాన పాత్రలో హ్యుమా ఖురేషి అద్భుతంగా నటించి, మెప్పించారు. ‘బేబీ డూ డై డూ’కథ ఏంటంటే... ఓ పేద కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఆడుకుంటూ ఓ పాడుబడ్డ బంగ్లాలోకి చేరుకుంటారు. ఆ ఇద్దరిలో ఒక అమ్మాయికి వినబడదు, మాట్లాడలేదు. అలా ఆ బంగళా లోపలికి వెళ్ళిన ఆ పిల్లలు ఓ ముసుగు వ్యక్తిని చూస్తారు. ఆ ముసుగు వ్యక్తి మరో వ్యక్తిని చంపుతూ ఉంటాడు. 

ఇంతలో ఈ పిల్లలు చేసిన అలికిడి వల్ల వీళ్ళిద్దరినీ వెంబడిస్తాడు. ఆ సమయంలో ఇద్దరిలో అన్నీ బావున్న అమ్మాయి ఆ ముసుగు వ్యక్తికి చిక్కుతుంది. అతను ఆ అమ్మాయిని చంపేస్తాడు. మూగ, చెవుడు ఉన్న అమ్మాయి మాత్రం తప్పించుకుంటుంది. ఆ పాప పేరే బేబీ. తాను తప్పించుకునే ముందు బేబీ తన సోదరిని ఆ ముసుగు వ్యక్తి చంపడాన్ని చూసి అతని పై పగ పెంచుకుంటుంది. బేబీ పెరిగే కొద్దీ అతని మీద తన పగ కూడా పెంచుకుంటుంది.


ఇది కూడా చదవండి:  ఆ దర్శకుడికి క్షమాపణలు: అందుకే కల్ట్ కి దర్శకత్వం చేశా!

 


 పుట్టు మూగ, చెవుడు ఉన్న బేబీ పాపా అనే వ్యక్తి దగ్గర శిక్షణ తీసుకుని ఓ హిట్‌ ఉమెన్‌గా తయారవుతుంది. పాపా చెప్పిన వ్యక్తులను ప్రత్యేకంగా తయారు చేసిన గొడుగు తుపాకీ సాయంతో చంపేస్తూ ఉంటుంది. పైకి ఓ సాదా సీదా అమ్మాయిలా కనిపించే బేబీ లోపల కరడుగట్టిన హంతకురాలిలా తయారవుతుంది. మరి... ఈ జర్నీలో బేబీకి ఆ ముసుగు వ్యక్తి దొరుకుతాడా? లేదా అన్నది మాత్రం నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ‘బేబీ డూ డై డూ’లోనే చూడాలి. ఇదో మంచి థ్రిల్లర్‌. సినిమా ఆఖర్లో వచ్చే ట్విస్టులు ఊహకందనివి. ఓ మంచి టైమ్‌పాస్‌ సినిమా.

 

[Huma Qureshi Baby Do die do netflix, Baby Do Die Do, Huma Qureshi, Netflix streaming, action thriller movie,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu news]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com