Home

»

Latest News

ఆ దర్శకుడికి క్షమాపణలు: అందుకే 'కల్ట్' కి దర్శకత్వం చేశా!

Oct 19, 2026 11:55AM

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విశ్వక్‌సేన్ అని చెప్పుకోవాల్సింది బదులు వరుస ప్లాప్స్ తో దూసుకుపోతున్న విశ్వక్ సేన్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఈ కొటేషన్ పర్ఫెక్ట్ సూటబుల్ అనేలా విశ్వక్ నే తన ప్లాప్స్ ని నిర్మొహమాటంగా ఒప్పుకుంటున్నాడు. కానీ నటుడుగా మాత్రం ఏ క్యారక్టర్ లోకైనా ఒదిగిపోయే కెపాసిటీ. 'గామి' మూవీ నే ఒక ఉదాహరణ. ఈ నెల 30 న కల్ట్ తో థియేటర్స్ లోకి రానున్నాడు.


పైగా ‘కల్ట్’ కి తనే దర్శకుడు. నిన్న ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతు  తాజుద్దీన్‌ నా నట గురువు. మొదట కల్ట్ కి తాజుద్దీన్ డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ వరుస ప్లాప్స్ లో ఉన్న నేను ఆయనపై భారం వేయదలచుకోలేదు. అందుకే నేనే దర్శకుడిగా బాధ్యతలు చేపట్టాను. ఈ విషయంలో తాజుద్దీన్‌కి  మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఆయన కష్టాన్ని గౌరవిస్తూనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. 


ఇది కూడా చదవండి: అతనితో కలిసి పని చేస్తున్నందుకే కాల్పులు: ఎవరు ఈ అనిల్ పండిత్!

 

 

కల్ట్  కథాంశం విషయానికి వస్తే, ఇది పూర్తిగా వియత్నాంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. కేవలం సాధారణ కమర్షియల్ హంగులతో కాకుండా, సరికొత్త యాక్షన్ మరియు రా సబ్జెక్ట్‌తో  తెరకెక్కించారు. అంతేకాకుండా, ఈ చిత్రంలో దాదాపు 20 మందికి పైగా సరికొత్త నూతన నటీనటులను టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ అయితే సబాగుంది. 150 మంది కొత్త నటీనటులు కల్ట్ ద్వారా పరిచయం కానున్నారు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్.

 

[vishwak Sen Apologises To Tajuddin, Vishwak Sen, Cult Movie, Tajuddin Director, Vishwak Sen Cult, Tollywood News, Cult Teaser Launch, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu news]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com