Home

»

Latest News

కొత్త లోక చాప్టర్ 1 రికార్డు గల్లంతు?: దెబ్బకొట్టింది మన తెలుగు హీరోయిన్ నే! 

Nov 17, 2026 2:03PM

ఏ సినీ రికార్డు శాశ్వతం కాదనే విషయం అందరకి తెలుసు. కానీ తన రికార్డుని చూసుకొని రీకార్డే మురిసిపోతే. ఇంకో సరికొత్త రికార్డు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు సినీ సర్కిల్స్ లో ఆ ఛాయలే కనిపిస్తున్నాయి. చాలా బలమైన నమ్మకంతో..


నేషనల్ క్రష్   రష్మిక మందన్న ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది. పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఈ క్యూట్ హీరోయిన్, ఇప్పుడు తన కొత్త చిత్రం ‘మైసా’తో మరో భారీ బాక్సాఫీస్ రికార్డుపై కన్నేసింది. గతంలో మలయాళ చలనచిత్ర పరిశ్రమలో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ సూపర్ హీరో మూవీ ‘లోకా: చాప్టర్ 1 - చంద్ర’ సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే.

ఈ లేడీ ఓరియెంటెడ్  చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు  301.41 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టి మలయాళ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డులను సృష్టించింది. కేవలం కేరళలోనే 120 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించగా, ఓవరాల్‌గా ఇండియా నెట్ కలెక్షన్లు 157.04 కోట్లకు చేరాయి. ఇప్పుడు అదే స్థాయిలో సరికొత్త రికార్డులని  తిరగరాయడానికి రష్మిక మందన్న నటిస్తున్న ‘మైసా’ సినిమా సిద్ధమవుతోంది.

కోవిడ్ అనంతర కాలంలో బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక కెరీర్‌లో ‘అనిమల్’ (రూ. 910.72 కోట్లు), ‘పుష్ప 2: ది రూల్’ (రూ. 1727.23 కోట్లు) అలాగే ‘ఛావా’ (రూ. 827.06 కోట్లు) వంటి చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. కేవలం ఈ మూడు చిత్రాల ద్వారానే ఆమె బ్యాక్ ట్యాక్స్‌గా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఏకైక భారతీయ నటిగా అరుదైన మైలురాయిని చేరుకున్నారు. అంతేకాకుండా సికిందర్ (రూ. 211.34 కోట్లు), తమ్మా (రూ. 211.8 కోట్లు), కుబేర (రూ. 138.86 కోట్లు) వంటి చిత్రాలతో పాటు ఆమె పోస్ట్-కోవిడ్ సినిమాలు అన్నీ కలుపుకొని ఏకంగా  5000 కోట్ల ప్రపంచస్థాయి మైలురాయిని టార్గెట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఇది కూడా చదవండి:ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్న బడా చిత్రాలివే: ఖచ్చితంగా విజేత ఈ హీరోనే! 

ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారిన ‘మైసా’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్యాణి ప్రియదర్శన్ ‘లోకా’ సినిమాతో నెలకొల్పిన అద్భుతమైన లేడీ ఓరియంటెడ్ మరియు బాక్సాఫీస్ రికార్డులను అధిగమించడమే లక్ష్యంగా రష్మిక ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం ద్వారా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సునామీ సృష్టిస్తుందోనని సినీ వర్గాలు తీవ్రంగా ఎదురుచూస్తున్నాయి.

రష్మిక గ్లామర్, అంకితభావం, నటనకి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే, ఈ టార్గెట్ సాధించడం కష్టమేమీ కాదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి రష్మిక వాళ్ల నమ్మకానికి రక్షణ కవచంగా ఉంటుందో లేదో చూడాలి.

మీకు నచ్చవచ్చు:బయటపడిన నిజం: ఆ తెలుగు హీరోకి బాలీవుడ్ నిర్మాత నుంచి కాస్ట్లీ కారు! 
మీకు నచ్చవచ్చు:ఆ హీరోయిన్ ని పెట్టుకోండి: సినిమా పక్కా హిట్టు!

 

[Rashmika,  Mysaa, Kalyani Priyadarshan, Kotha Lokah Chapter 1, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com