
సినిమా.. నిర్మాణ దశలో ఉన్నప్పుడే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది బతుకుతున్నారు. ఈ మాట అక్షర సత్యమని లైవ్ లో తెలుసుకోవాలంటే తెల్లవారుజామున హైదరాబాద్ లో కృష్ణ నగర్ ని అనుకోని ఉండే ఇంద్రనగర్ గడ్డ దగ్గరకి వస్తే చాలు. మరి సినిమా రిలీజైన తర్వాత హిట్ టాక్ తెచ్చుకుంటే పాన్ ఇండియా, ఓవర్సీస్ వ్యాప్తంగా ఎంత మంది బతుకుతారో అనే ఫిగర్ కి లెక్కే లేదు. కానీ వాళ్లందరికీ అన్యాయం చేస్తూ హిట్ శాతం చాలా లో డిగ్రీస్ లో ఉంది. అందుకు గల కారణం ఇదే అని ఫిలిం సర్కిల్ తో పాటు సినీ అభిమానులు, ప్రేక్షకుల సినీ హార్ట్ లో నిత్యం ఒక విషయం స్ఫురణకి వస్తు ఉంటుంది. మరి వారి హార్ట్ బీట్ లో దాగి ఉన్న భావాలేంటో చూద్దాం.
తెలుగు సినిమా చరిత్రలో ఒక చిత్రం ఘనవిజయం సాధించాలంటే కేవలం హీరో ఇమేజ్, భారీ యాక్షన్ సీన్లు మాత్రమే ఉంటే సరిపోదు. కథలో హీరోయిన్ క్యారక్టర్ కి కూడా సమానమైన ప్రాధాన్యత ఉన్నప్పుడే ఆ సినిమా ప్రేక్షకుల హృదయాలకి హత్తుకుంటుంది. ఒకప్పుడు తెలుగు వెండితెరపై కథానాయికల రోల్స్ కథను మలుపు తిప్పే శక్తివంతమైన పిల్లర్లుగా ఉండేవి. సావిత్రి, జమున, భానుమతి, శ్రీదేవి, విజయశాంతి వంటి మహానటీమణులు నటించిన చిత్రాల్లో హీరోలకు దీటుగా వారి పాత్రలు తీర్చిదిద్దబడ్డాయి.
'మాయాబజార్', 'మిస్సమ్మ', 'గుండమ్మ కథ', 'ప్రతిఘటన', 'కర్తవ్యం' వంటి చిత్రాలు కేవలం హీరోల వల్లే కాకుండా, హీరోయిన్ల అద్భుతమైన పాత్రల బలం వల్లే కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచాయి. ఆ కాలంలో సినిమా విజయంలో కథానాయికల పాత్ర 50 శాతానికి పైగా ప్రభావం చూపేదని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.
అయితే కాలక్రమేణా కమర్షియల్ సినిమాల మోజు పెరిగిపోవడంతో హీరోయిన్ పాత్రల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. గత దశాబ్ద కాలంలో వచ్చిన చాలా పెద్ద సినిమాల్లో హీరోయిన్లు కేవలం మూడు పాటలు, నాలుగు రొమాంటిక్ సన్నివేశాలకు మాత్రమే పరిమితమయ్యారు. కథలో వారి క్యారక్టర్ కి ఎలాంటి బలం లేకపోవడం, హీరో ఎలివేషన్ల మధ్య వారు తేలిపోవడం ఒక సాధారణ విషయంగా మారిపోయింది.

హీరో చుట్టూ తిరిగే కథల్లో హీరోయిన్ కేవలం ఒక గ్లామర్ డాల్‌గా మిగిలిపోవడంతో ప్రేక్షకులకు ఆ పాత్రలతో ఎమోషనల్ కనెక్ట్ తగ్గిపోయింది. కేవలం హీరో ఇమేజ్ను నమ్ముకుని, బలమైన మహిళా పాత్రలు లేకుండా తీసిన ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి:కోలీవుడ్ కి DNK
కానీ ఇటీవలి కాలంలో తెలుగు సినిమా తీరు మళ్ళీ మారుతోంది. ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పుని గుర్తించిన దర్శకులు మళ్ళీ హీరోయిన్ లకి కథలో కీలక స్థానం కల్పిస్తున్నారు. దీనికి నిదర్శనంగా గత కొంతకాలంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన కొన్ని సినిమాలని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి 'సీతారామం' సినిమాలో సీతామహాలక్ష్మి క్యారక్టర్ లేకపోతే ఆ కథకు ఆత్మ ఉండేది కాదు. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంలో మృణాల్ ఠాకూర్ ది ప్రధాన భూమిక. అలాగే 'హాయ్ నాన్న' చిత్రంలో యష్న పాత్ర చుట్టూనే కథ మొత్తం నడుస్తుంది. ఆ పాత్రలోని ఎమోషన్ ప్రేక్షకులను కట్టిపడేసి సినిమాని బ్లాక్‌బస్టర్ చేసింది.
అంతేకాకుండా 'మహానటి', 'అరుంధతి', 'భాగమతి', 'సైరా నరసింహారెడ్డి', 'పుష్ప' వంటి చిత్రాల్లోనూ హీరోయిన్ పాత్రలకు ఇచ్చిన ప్రాధాన్యత ఆ సినిమాల విజయానికి ఎంతో దోహదపడింది. 'పుష్ప' సినిమాలో శ్రీవల్లి పాత్రకు మాస్ ఆడియన్స్‌లో వచ్చిన క్రేజ్ ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో 350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడానికి ఒక కారణమైంది. ఇటీవల వచ్చిన 'కల్కి 2898 AD' చిత్రంలో కూడా సుమతి పాత్ర చుట్టూనే అసలు కథ తిరుగుతుంది. 1000 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రంలో ఆ పాత్రకున్న ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలిసిందే.

దీన్ని బట్టి అర్థమయ్యే అసలు సత్యం ఏంటంటే, సినిమాలో హీరోయిన్ క్యారక్టర్ కి కేవలం అలంకారప్రాయంగా కాకుండా, కథని ముందుకు నడిపించే బలమైన శక్తిగా తీర్చిదిద్దితే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు.ఈ సూత్రాన్ని కొంత మంది దర్శకులు నమ్మి ఆ దిశగా దూసుకెళ్తున్నారు. కాబట్టి మిగతా దర్శకులు, రచయితలు కూడా తల్లి లేనిదే సృష్టికి జననం ఎలా అయితే లేదో, ఏ జోనర్ కథ అయినా సరే హీరోయిన్ క్యారక్టర్ ని బేస్ చేసుకొని కథకి లింక్ చేస్తేనే సినీ పుట్టకకి అర్ధం, పరమార్ధం. దాంతో సినిమా ముసి ముసి నవ్వులతో పరవళ్లు తొక్కుతుంది. అదే జరిగితే మేకర్స్ కి సినిమా ఏం ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మీకు నచ్చవచ్చు:హిందుస్థాన్ వాళ్ళ సొంతమా: సింగర్ వ్యాఖ్యలు వైరల్!
మీకు నచ్చవచ్చు:త్రిష పెంపుడు కుక్క సంచలనం
[Importance of heroine roles, sai Pallavi,Mrunal Thakur, Telugu Cinema]






