Home

»

Latest News

తెలుగు హీరోకి 3 .5 కోట్ల కారు గిఫ్ట్ గా ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత: ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

Nov 17, 2026 12:16PM


ఇక నుంచి 'ఎప్పుడో అయిపోయిన పెళ్ళికి ఇప్పుడు బ్యాండ్ మేళం ఏంటనే వర్డ్ ని చూసి జాలి, ఎగతాళి చెయ్యకండి. ఎందుకంటే ఆ బ్యాండ్ మేళం 3 .5 కోట్ల ఖరీదైన కారుని హీరోకి గిఫ్ట్ గా ఇచ్చేసింది. మరి పూర్తి మాటర్ పై లుక్ వేద్దాం.

బాలీవుడ్‌లో ఒకానొక సమయంలో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలై, ఆ తర్వాత కాలంలో కల్ట్ క్లాసిక్‌గా మారిన చిత్రం ‘సనమ్ తేరీ కసమ్’. తెలుగు మూలాలున్న టాలెంటెడ్ హీరో హర్షవర్ధన్ రాణే, మావ్రా హొకేన్ జంటగా కనిపించిన ఈ రొమాంటిక్ డ్రామా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మొదట 2016 ఫిబ్రవరి 5న విడుదలై ఆశించిన వసూళ్లబి  సాధించలేకపోయింది. కానీ కాలక్రమేణా అభిమానులు,ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.

 రీ-రిలీజ్ చేయగా, బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో కలెక్షన్ల వర్షం కురిపించడంతో  నిర్మాత హర్షవర్ధన్ రాణేకి ‘ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా’ (Land Rover Defender Octa) ఎస్‌యూవీని కానుకగా అందించాడు. భారతీయ మార్కెట్లో ఈ సరికొత్త లగ్జరీ కారు ధర సుమారు 3.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిర్మాత తనకిచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ రేంజ్ గిఫ్ట్ ఇవ్వడంతో హర్షవర్ధన్ రాణే ఫిదా అయిపోయాడు.

 ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నిర్మాత దీపక్ ముకుట్ తనకు కారు తాళాలు అందిస్తున్న ఫోటోని  షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.  గత ఏడాది ‘సనమ్ తేరీ కసమ్’ సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలని కోరుతూ తాను, పలువురు అభిమానులు ప్రొడ్యూసర్ ఆఫీస్ ముందు నిలబడిన క్షణాలని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: తిరుమల కొండపై నితిన్: ఈ సారి అలియాస్ రుక్మిణి తో హిట్టు పక్కా!

రీ రిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా  54.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లని సాధించడమే కాకుండా, ఇండియాలో ఏకంగా  42.28 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయపరిచింది. కేవలం రీ-రిలీజ్‌లోనే తొలి రోజు రూ. 4.25 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. మరి గుర్తుందిగా 'ఎప్పుడో అయిపోయిన పెళ్ళికి ఇప్పుడు బ్యాండ్ మేళం' అనే వర్డ్ కి ఎనలేని గౌరవం ఇవ్వాలని.

 

తెలుగులో ‘తకిట తకిట’, ‘అవును’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ వంటి చిత్రాల్లోహర్షవర్ధన్ కనిపించాడు.

మీకు నచ్చవచ్చు:అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర తెరపైకి: ఆ అగ్ర హీరోతో!
మీకు నచ్చవచ్చు: రామోజీ రావు గారి వెనక ఉన్న ఆ మూవీ కథ ఇదే! 

 

[Harshvardhan Rane, Sanam Teri Kasam, Deepak Mukut, Land Rover]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com