
హైదరాబాద్‌లో సినిమా చూడటం అంటే ఒకప్పుడు ప్రసాద్స్ ఐమాక్స్ గుర్తొచ్చేది. ముఖ్యంగా భారీ స్క్రీన్‌పై హాలీవుడ్ సినిమాలు చూడాలనుకునే సినీ అభిమానులకు అది ప్రత్యేకమైన అనుభూతి. కానీ 2015లో ప్రసాద్స్‌లో ఐమాక్స్ ఫార్మాట్ నిలిచిపోవడంతో నగర ప్రేక్షకులకు ఆ అనుభవం దూరమైంది.
అప్పటి నుంచి ఐమాక్స్ మళ్లీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్. పదకొండేళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఐమాక్స్ సందడి చేయబోతోంది. అది కూడా ఒకప్పటి సుదర్శన్ 70ఎంఎం థియేటర్ ఉన్న ప్రాంతంలోనే కావడం విశేషం.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని పాత సుదర్శన్ 70ఎంఎం థియేటర్ స్థలంలో నిర్మిస్తున్న ఏఎంబీ విక్టరీ సినిమాస్‌లో ఐమాక్స్ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో మహేశ్ బాబు, వెంకటేశ్‌లకు సంబంధించిన ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. మొత్తం ఏడు స్క్రీన్లతో ఈ మల్టీప్లెక్స్ సిద్ధమవుతోంది. ఇందులో ఒకటి ఐమాక్స్ విత్ లేజర్ స్క్రీన్ కాగా, మరొకటి 4DX స్క్రీన్. మిగిలిన ఐదు రెగ్యులర్ స్క్రీన్లు.

తాజా సమాచారం ప్రకారం.. ఈ మల్టీప్లెక్స్ డిసెంబర్ 18, 2026 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మొదటి సినిమాగా హాలీవుడ్ మూవీ ‘డ్యూన్: పార్ట్ త్రీ’ ప్రదర్శించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: వారణాసి నుంచి అఫీషియల్ అప్డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్కి బ్లాస్టింగ్ న్యూస్.!
హైదరాబాద్‌లో ఐమాక్స్ అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ప్రసాద్స్. భారీ 70ఎంఎం స్క్రీన్‌పై సినిమాలు చూసేందుకు అప్పట్లో నగరంలోని ప్రేక్షకులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా సినీ అభిమానులు వచ్చేవారు. ముఖ్యంగా ‘అవతార్’, ‘ది డార్క్ నైట్’ వంటి హాలీవుడ్ సినిమాలను ఆ స్క్రీన్‌పై చూసిన అనుభూతిని ఇప్పటికీ చాలామంది గుర్తుచేసుకుంటుంటారు.
అయితే 2014-15 మధ్య ప్రసాద్స్‌లో ఐమాక్స్ 70ఎంఎం ఫార్మాట్ నిలిచిపోయింది. ఆ తర్వాత అక్కడ పీసీఎక్స్ ఫార్మాట్‌లో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దీంతో హైదరాబాద్ ప్రేక్షకులు ఐమాక్స్ అనుభవం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఏఎంబీ విక్టరీ రూపంలో ఆ లోటు తీరనుంది.

హైదరాబాద్‌లో ఐమాక్స్ తిరిగి రావడం కేవలం హాలీవుడ్ సినిమాల అభిమానులకే కాదు.. తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా ప్రత్యేకమే. ముఖ్యంగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కానుంది. దీంతో కొత్త ఐమాక్స్ స్క్రీన్‌పై ‘వారణాసి’ని చూసే అవకాశం కోసం అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక హైదరాబాద్‌లోని హకీంపేటలో ఏఎంబీ సినిమాస్ మరో ఐమాక్స్ స్క్రీన్‌ను ఏర్పాటు చేసే ప్రణాళిక కూడా ఉంది. అయితే దాని ప్రారంభ తేదీపై ఇంకా స్పష్టత లేదు. అక్కడ 1.43:1 ట్రూ ఐమాక్స్ అనుభవం అందించే అవకాశం ఉందని సమాచారం.
మొత్తానికి పదేళ్లకు పైగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ ప్రేక్షకులకు ఐమాక్స్ మళ్లీ అందుబాటులోకి రాబోతోంది. డిసెంబర్ 18న ‘డ్యూన్ 3’తో ఈ కొత్త ప్రయాణం మొదలైతే.. ఆ తర్వాత ‘వారణాసి’ వంటి భారీ సినిమాలను ఈ ఫార్మాట్‌లో చూసే అవకాశం ఉండటంతో సినీ అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.
మీకు నచ్చవచ్చు:
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. వారణాసి తర్వాత జక్కన్న నెక్స్ట్ మూవీ ఇదేనా.?
వారణాసి స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!
[IMAX Hyderabad, AMB Victory Cinemas, Mahesh Babu, Venkatesh, Varanasi]






