Home

»

Latest News

స్కిన్ షో: విజయ్ ముందే ఓపెన్‌గా చెప్పేసిన రష్మిక.!

Oct 22, 2026 12:55PM

సినిమాల్లో గ్లామర్ షో చేయడం అనేది హీరోయిన్లకు కొత్త విషయమేమీ కాదు. కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాల్లో గ్లామరస్‌గా కనిపించాల్సి ఉంటుంది. అయితే ఎంతవరకు గ్లామర్‌గా కనిపించాలి? ఎలాంటి దుస్తులు ధరించాలి? అనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయంపై నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఎలాంటి సన్నివేశాలకు ఇబ్బంది పడుతుంది? తనకంటూ ఎలాంటి హద్దులు పెట్టుకుంది? అనే విషయాలను ఓపెన్‌గా చెప్పేసింది.

ఇటీవల కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 9లో రష్మిక, విజయ్ దేవరకొండ జంటగా పాల్గొన్నారు. ఈ షోలో తమ వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లితో పాటు సినిమా కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ల గ్లామర్, దుస్తుల విషయంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి చర్చ వచ్చింది.

‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై గతంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆమెను గ్లామర్ కోణంలో చూపించిన విధానంపై కొందరు విమర్శలు చేశారు. ఈ అంశాన్నే కరణ్ జోహార్ ప్రస్తావిస్తూ.. జాన్వీకి ఎదురైన పరిస్థితులు సౌత్ సినిమాల్లో రష్మికకు కూడా ఎదురయ్యాయా? అని ప్రశ్నించాడు.

దీనికి రష్మిక స్పందిస్తూ.. కొన్ని పాత్రలకు బికినీ వంటి దుస్తులు అవసరం కావొచ్చని చెప్పింది. అయితే తన వ్యక్తిగత అభిరుచి మాత్రం అందుకు భిన్నమని స్పష్టం చేసింది. ఎక్స్‌పోజింగ్, స్కిన్ షో విషయంలో తాను అంతగా సౌకర్యంగా ఫీల్ కానని, తనకంటూ కొన్ని పరిమితులు ఉన్నాయని వెల్లడించింది.

కమర్షియల్ సినిమాల్లో నటించేటప్పుడు కొన్నిసార్లు పూర్తిగా సౌకర్యంగా అనిపించని కాస్ట్యూమ్స్ ధరించాల్సి రావొచ్చని కూడా రష్మిక అంగీకరించింది. కానీ అలాంటి సందర్భాల్లోనూ తాను ఎక్కడ వరకు వెళ్లాలి? ఎక్కడ వద్దనాలి? అనే విషయంలో స్పష్టంగా ఉంటానని చెప్పింది. తన నిర్ణయాలను గౌరవించే దర్శకులతో పనిచేయడానికే ఎక్కువగా ఇష్టపడతానని పేర్కొంది.

ఇక విజయ్ కూడా ఈ చర్చలో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకున్న తర్వాత.. కొన్ని సన్నివేశాలు చేయడం తమ బాధ్యత అని భావించేలా నటీనటులపై ఒత్తిడి తీసుకొస్తారని చెప్పాడు. తమకు నచ్చని విషయానికి నో చెబితే ప్రొఫెషనల్‌గా లేరనే అభిప్రాయం ఏర్పడుతుందేమోనని చాలామంది నటీమణులు ఆందోళన చెందుతారని వివరించాడు.

నటీనటులకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలిగే వాతావరణం ఉండాలని విజయ్ అభిప్రాయపడ్డాడు. ఒక సన్నివేశం విషయంలో ఇబ్బందిగా అనిపిస్తే.. దాన్ని తిరస్కరించే హక్కు వారికి ఉండాలని చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే తొక్కేస్తారా.. ‘లిటిల్ హార్ట్స్’ హీరో మౌళి ఎమోషనల్.!

 

 

 

[Rashmika About Skin Show, Koffee With Karan 9, Karan Johar Show, Rashmika Mandanna, Vijay Deverakonda, Karan Johar, Janhvi Kapoor, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com