
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ మాన్ షో బద్రి సాధించిన ఘన విజయం తెలిసిందే. పవన్ బాడీ లాంగ్వేజ్, డ్రెస్ స్టైల్, డైలాగ్ డెలివరీ కుర్రకారుని పిచ్చెక్కించింది. దీంతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి నిర్మాతలకి కనక వర్షాన్ని కురిపించింది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించి పవన్ కి దీటుగా అదిరిపోయే డైలాగ్ చెప్పిన పాపకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ హోదాలో అభిమానులని, సినీ ప్రియులని అలరిస్తూ ఉంది. మరి పూర్తి మ్యాటర్ చదివాక మీరు కూడా సినీ ఆనందాన్ని పొందటం ఖాయం.
ఒక సన్నివేశంలో బద్రి(పవన్ కళ్యాణ్) పార్క్ లో దిగులుగా కూర్చొని ఉంటాడు. ఆ టైములో ఓ పాప వచ్చి ఎందుకు దిగులుగా ఉన్నారు అని అడుగుతుంది. ‘నాకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు’ అని సమాధానం ఇస్తాడు. దానికి ఆ పాప ‘నాకు కూడా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు’ అంటూ ఫన్నీ ఆన్సర్ ఇస్తుంది. చిన్న వయసులోనే ఎంతో క్యూట్ గా ఆ పాప చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్. అయితే ఆ పాప మరెవరో కాదు ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ కూతురు చేతన. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేతన ఈ విషయం చెప్పడంతో బద్రి మరో సారి వైరల్ గా నిలిచాడు. తనకి పిల్లలు పుట్టరని తెలిసి ఒక యువతీ తన ప్రియుడి చేత వేరే అమ్మాయిని ప్రేమించేలా చెయ్యడం అనే పాయింట్ తో బద్రి తెరకెక్కింది.
ఇది కూడా చదవండి: విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన కిచ్చా సుదీప్ దంపతులు.. మళ్లీ ఎలా ఒక్కటయ్యారో తెలుసా?

చేతన మొదటగా శ్రీకాంత్ నుంచి వచ్చిన 'గిల్లి కజ్జాలు'లో బాలశ్రీకృష్ణుడిగా చేసి నటించింది. ఆ తర్వాత ‘బద్రి’, ‘చిత్రం’, ‘భద్రాచలం’, ‘పౌర్ణమి’ వంటి సినిమాల్లోనూ ఛైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. 2017 లో వచ్చిన ‘పిచ్చి గా నచ్చావ్’ తో పాటు 'ప్యార్' లో హీరోయిన్ గాను చేసింది చేతన.
[Badri Child Artist Details, Badri Child Artist chetana uttej now, chetana uttej, pawan kalyan badri movie, uttej daughter chetana, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






