Home

»

Latest News

రామాయణ vs ధురంధర్ 2:  రెండో శుక్రవారం కలెక్షన్స్ లో ఎవరు టాప్ అంటే!

Nov 14, 2026 1:26PM

ఎన్ని షో లు వేసినా, చేసినా ఏ సినీ రికార్డు శాశ్వతం కాదనే మాట సినీ సర్కిల్స్ లో తరచు వినపడే మాట. అందుకే అంటారు రికార్డు చూసి మురిసిపోకూడదని. ఇప్పుడు ఆ నిజం రామాయణ ద్వారా మరోసారి నిరూపితమవుతూ వస్తుంది. పూర్తి విషయం చూసేద్దాం.

భారతీయ సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ రికార్డుల సునామీ సృష్టిస్తూ సరికొత్త చరిత్రను లిఖిస్తున్నాయి దిగ్గజ చిత్రాలు. బాక్సాఫీస్ వద్ద ఏ మూవీ ఎంత కలెక్ట్ చేస్తోంది, ఏ సినిమా పైచేయి సాధిస్తోంది అనే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా విడుదలైన రెండో శుక్రవారం (సెకండ్ ఫ్రైడే) వసూళ్ల విషయంలో రెండు రామాయణ, 'ధురంధర్ 2 మధ్య పోటీ నెలకొని ఉంది. 

రామాయణ'  విడుదలైన 9వ రోజున (రెండో శుక్రవారం) అన్ని భాషల్లో కలిపి . 47.85 కోట్ల ఆల్ ఇండియా నెట్ కలెక్షన్లని  సాధించి సంచలనం సృష్టించింది. దీంతో అంతకుముందు 'ధురంధర్ 2: నమోదు చేసిన 42 కోట్ల రికార్డు చెల్లాచెదురు అయ్యింది . దీంతో ఆల్ ఇండియా స్థాయిలో అత్యధిక సెకండ్ ఫ్రైడే కలెక్షన్లు సాధించిన చిత్రంగా రామాయణ  సరికొత్త చరిత్ర సృష్టించిందని సాక్నిల్క్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ భారీ వసూళ్లతో 'రామాయణం' టోటల్ ఇండియా నెట్ కలెక్షన్లు  612.45 కోట్లకు చేరగా, గ్రాస్ కలెక్షన్లు రూ. 732.20 కోట్లకు తాకాయి.   అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ మైథలాజికల్ డ్రామా జోరు కొనసాగుతోంది. కేవలం ఒక్క రోజులో ఓవర్సీస్‌లో రూ. 25 కోట్లు రాబట్టడంతో, ఓవర్సీస్ గ్రాస్ 378.50 కోట్లకు మరియు ప్రపంచవ్యాప్త (వరల్డ్ వైడ్) గ్రాస్ కలెక్షన్లు  1,110.70 కోట్ల మైలురాయిని విజయవంతంగా దాటాయి.

ఇది కూడా చదవండి: తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం అహాన్ని అణిచివేసిన గుడి పూజారి!
 

తమిళంలో రూ. 2.75 కోట్లు (1,164 షోలు), తెలుగులో  2.60 కోట్లు (1,532 షోలు) వసూలు చేస్తూ అన్ని ప్రాంతీయ మార్కెట్లలోనూ తన సత్తా చాటుతోంది. అయితే, హిందీ వెర్షన్ పరంగా చూస్తే మాత్రం 'రామాయణం' (రూ. 36.25 కోట్లు - రూ. 35 కోట్ల అంచనా) 'ధురంధర్ 2' (రూ. 37.50 కోట్లు) సాధించిన హిందీ సెకండ్ ఫ్రైడే ఆల్-టైమ్ రికార్డును బ్రేక్ చేయలేక రెండో స్థానంలో నిలిచింది.

'ధురంధర్ 2' చిత్రం హిందీ మార్కెట్లో తన హవాను ఏమాత్రం తగ్గకుండా కొనసాగిస్తూ మొదటి స్థానాన్ని పదిలంగా కాపాడుకుంది. ఈ రెండు చిత్రాల మధ్య బాక్సాఫీస్ వద్ద జరుగుతున్న ఈ హోరాహోరీ పోరు రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు తెరలేపుతుందనేది సినీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠని రేకెత్తిస్తోంది.


మీకు నచ్చవచ్చు: హీరోల అత్యవసర మీటింగ్!
మీకు నచ్చవచ్చు:బాలయ్య సరికొత్త రికార్డు: ఫ్యాన్స్ లో జోష్!

 

[Ramayana, Dhurandhar 2, second Friday record, Ranbir Kapoor, Ranveer Singh]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com