
గోల్డెన్ లెగ్ హోదాలో తన సినీ జైత్రయాత్రని కొనసాగిస్తూ ఉన్న భామ మీనాక్షి చౌదరి. అభిమానులని కూడా అంతకు అంత పెంచుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఈ భామ అభిమానులు ఈ రోజు మొత్తం తన గురించే ఆలోచించేలా చేయాలనే దృఢ సంకల్పంతో ఉందనుకుంటా. మరి మీనాక్షి చెప్పిన మాటలు ఆ విధంగా ఉన్నాయి మరి.
తాజాగా తన వ్యక్తిగత అలవాట్లు, ఆహారపు రుచులు మరియు సినిమా విశేషాల గురించి పంచుకున్న ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే తారలు డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటారని, లేదా స్పెషల్ బాక్సుల్లో ఇళ్ల నుండి భోజనం తెప్పించుకుంటారని అందరూ భావిస్తుంటారు.
అయితే, మీనాక్షి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా తాను కేవలం సినిమా ప్రొడక్షన్ వారు అందించే భోజనాన్నే ఎక్కువగా ఇష్టపడతానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.షూటింగ్ స్పాట్లో చిత్ర యూనిట్ అందరితో కలిసి కూర్చుని తినడమే తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆమె పేర్కొంది.

ఎక్కడైనా షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి హంగులు ఆశించకుండా, సాధారణంగా ప్రొడక్షన్ బాయ్స్ తెచ్చే భోజనమే తన మొదటి ప్రాధాన్యత .వెరైటీ ఫుడ్స్ కంటే సెట్స్‌లో అందరూ తినే సాధారణ భోజనమే తన ఆరోగ్యానికి, మనసుకి చాలా సంతృప్తిని ఇస్తుంది.
ఇది కూడా చదవండి: రామాయణ vs ధురంధర్ 2: రెండో శుక్రవారం కలెక్షన్స్ లో ఎవరు టాప్ అంటే!
ఇంట్లో ఎక్కువగా వెజిటేరియన్. అందుకే బయటకి వెళ్తే నాన్ వెజ్ తింటాను. హీరోయిన్ గా మారిన తర్వాత చాలా అప్షన్స్ దొరికాయి. కొన్ని దేశంలో కీటకాలు వడ్డించారు. కానీ నేను వాటిని ముట్టలేదు అని చెప్పుకొచ్చింది.

సినిమా పరిశ్రమలో గ్లామర్ ప్రపంచానికి దూరంగా, తనకంటూ కొన్ని వ్యక్తిగత విలువలను పాటిస్తూ ముందుకు సాగుతున్న మీనాక్షి చౌధురి లైఫ్ స్టైల్ ఇప్పుడు యూత్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మీకు నచ్చవచ్చు: తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం అహాన్ని అణిచివేసిన గుడి పూజారి!
మీకు నచ్చవచ్చు: దొంగ నాకొడుకు కలెక్షన్స్!
[Meenakshi Chaudhary, Production Food, Tollywood, chicken]






