Home

»

Latest News

'దాదా'సాంగ్ వైరల్: బావలే బావలే ఇక్కడున్న వాళ్లంతా బావలే..ట్రెండింగ్ లోకి వచ్చేసింది!

Nov 14, 2026 10:59AM

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ దాదా ధమాకా సాంగ్ నర్గిస్ ఫక్రి తో కలిసి అభిమానులు, సంగీత ప్రియుల నోళ్ళల్లో 'బావలే బావలే ఇక్కడున్న వాళ్లంతా బావలే' అని పాడుకునేలా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత ప్రతి ఒక్కరి నోట నుంచి హమ్ చేసే పదంలాగా వినిపిస్తుండటం విశేషం ఇప్పుడు ఈ  ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

 సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్  తమన్ అందించిన ఊరమాస్ బీట్స్‌కి  తోడు, ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి అందించిన క్యాచీ లిరిక్స్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నాయి.ఈ సాంగ్ లో ప్రత్యేకమైన హైలైట్ ఏంటంటే బాలయ్య దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత మరోసారి తన గొంతు సవరించి ఫుల్ ఎనర్జిటిక్ లైన్స్ ఆలపించడం.

గతంలో 'పైసా వసూల్' చిత్రంలోని 'మామా ఏక్ పెగ్ లా' పాటకు గాత్రం అందించి అలరించిన బాలయ్య, ఇప్పుడు 'దాదా ధమాకా'తో మరోసారి సింగర్ అవతారమెత్తి అభిమానులకు అద్భుతమైన మ్యూజికల్ ట్రీట్ ఇచ్చాడు.

ఆయన హస్కీ వాయిస్‌కు సింగర్ శ్రీపూర్ణిమ గొంతు కలవడంతో ఈ  సాంగ్ కి  మరింత మాస్ వైబ్స్ వచ్చాయి. కేవలం పాట పరంగానే కాకుండా, ఇందులో బాలయ్య వేసిన విజువల్ డ్యాన్స్ మూమెంట్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్ ల రూపంలో తమ ఆనందాన్ని  వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: దొంగ నాకొడుకు ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్!
 

బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ  వేసిన స్టెప్పులు, అందచందాలు, బాలయ్య, ఆమె  మధ్య కెమిస్ట్రీ స్క్రీన్‌పై అదిరిపోతుంది కూడా  చెప్పవచ్చు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కిన ఈ భారీ సాంగ్ విజువల్స్ కలర్‌ఫుల్‌గా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా గ్లింప్స్ బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్‌తో అంచనాలను పెంచగా, ఇప్పుడు ఈ ఫస్ట్ సింగిల్ ద్వారా మ్యూజిక్ ప్రమోషన్స్ అంబరాన్ని తాకాయి.

ఈ భారీ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ నెగిటివ్ రోల్ లో  కనిపించనున్నారు. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు.

 

మీకు నచ్చవచ్చు:థమన్ ఊర మాస్ సాంగ్ లో ఒకటిగా ఖాయం!
మీకు నచ్చవచ్చు: టాక్సిక్ పై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు!

 

[Balakrishna, Nargis fakri, Damaka Song, Gopichand Malineni, thaman]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com