Home

»

Latest News

బ్యాట్‌మ్యాన్‌ పాత్ర కోసం పోటీపడ్డారు.. ఇప్పుడు జేమ్స్‌ బాండ్‌ కోసం పోటీ పడుతున్నారు.!

Nov 14, 2026 1:25PM

ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్‌ ఫ్రాంచైజీల్లో ‘జేమ్స్ బాండ్‌’ ఒకటి. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 007 పాత్రలో నటించిన హీరోలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అయితే చివరిగా డేనియల్‌ క్రేగ్‌ ‘నో టైమ్‌ టు డై’ సినిమాతో బాండ్‌ పాత్రకు వీడ్కోలు పలికారు. అప్పటి నుంచి తదుపరి జేమ్స్‌ బాండ్‌ ఎవరు అవుతారనే చర్చ కొనసాగుతోంది.

ఇప్పుడు ఈ పాత్ర కోసం మరో ఇద్దరు హాలీవుడ్‌ నటుల పేర్లు తెరపైకి వచ్చాయి. ‘ది బ్యాట్‌మ్యాన్‌’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాబర్ట్‌ ప్యాటిన్సన్‌, ‘సూపర్‌మ్యాన్‌’లో లెక్స్‌ లూథర్‌గా నటించిన నికోలస్‌ హౌల్ట్‌ బాండ్‌ పాత్ర కోసం స్క్రీన్‌ టెస్ట్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి పేర్లు ఈ రేసులో చేరడంతో హాలీవుడ్‌లోనే కాదు, జేమ్స్‌ బాండ్‌ అభిమానుల్లోనూ ఆసక్తి పెరిగింది.

రాబర్ట్‌ ప్యాటిన్సన్‌ విషయానికి వస్తే.. ‘ట్వైలైట్‌’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు ‘హ్యారీ పాటర్‌ అండ్‌ ది గోబ్లెట్‌ ఆఫ్‌ ఫైర్‌’లోనూ నటించారు. ఆ తర్వాత విభిన్నమైన పాత్రలు చేస్తూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇక డీసీ ఫ్రాంచైజీలో బ్యాట్‌మ్యాన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం డెనిస్‌ విల్లెనెవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్యూన్‌: పార్ట్‌ త్రీ’లో కూడా నటిస్తున్నారు.

మరోవైపు నికోలస్‌ హౌల్ట్‌ కూడా పెద్ద సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమే. ‘ఎక్స్‌మెన్‌’ సిరీస్‌లో నటించిన ఆయన, ఇటీవల ‘సూపర్‌మ్యాన్‌’లో లెక్స్‌ లూథర్‌ పాత్రలో కనిపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో బ్యాట్‌మ్యాన్‌ పాత్ర కోసం కూడా రాబర్ట్‌ ప్యాటిన్సన్‌, నికోలస్‌ హౌల్ట్‌ పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరకు ఆ అవకాశం ప్యాటిన్సన్‌కు దక్కింది. ఇప్పుడు ఇద్దరూ జేమ్స్‌ బాండ్‌ పాత్ర కోసం పోటీలో ఉన్నట్లు వార్తలు రావడం మరో విశేషం.

ఇది కూడా చదవండి: కూలీగా స్మగ్లింగ్‌ ముఠాలోకి ధనుష్‌, పోలీస్ ఆఫీస‌ర్‌గా సాయిపల్లవి.. ఏంటి ఈ ఆపరేషన్.?

ఈ ఇద్దరితో పాటు కల్లమ్‌ టర్నర్‌, జోష్‌ ఓకానర్‌, జాక్‌ లాడెన్‌ పేర్లు కూడా ఈ రేసులో వినిపిస్తున్నాయి. ప్రముఖ సింగర్‌, నటుడు హ్యారీ స్టైల్స్‌ కూడా ఈ పాత్ర కోసం చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో జేమ్స్‌ బాండ్‌గా నటించిన పియర్స్‌ బ్రాస్నన్‌.. కల్లమ్‌ టర్నర్‌కు మద్దతు తెలిపారు. మరోవైపు నటుడు గ్యారీ ఓల్డ్‌మన్‌ తదుపరి బాండ్‌ ఎవరనేది ఇప్పటికే ఖరారైందని వ్యాఖ్యానించడం కూడా చర్చనీయాంశమైంది.

ఇక కొత్త జేమ్స్‌ బాండ్‌ సినిమాకు ‘డ్యూన్‌’ ఫేమ్‌ డెనిస్‌ విల్లెనెవ్‌ దర్శకత్వం వహించనున్నారు. ‘పీకీ బ్లైండర్స్‌’ సృష్టికర్త స్టీవెన్‌ నైట్‌ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. అమెజాన్‌ ఎంజీఎం ఆధ్వర్యంలో తెరకెక్కనున్న ఈ 26వ బాండ్‌ చిత్రాన్ని నిర్మాతలు ఆమీ పాస్కల్‌, డేవిడ్‌ హేమన్‌ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కొత్త బాండ్‌ ఎవరనేది అధికారికంగా ప్రకటించలేదు. మరి ఈసారి 007 పాత్రలో ఎవరు కనిపిస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

మీకు నచ్చవచ్చు:

హీరోల అత్యవసర మీటింగ్.. దాదా సాంగ్‌పై చర్చ!

పెళ్లికి సిద్ధమైన మ‌రో హీరోయిన్.. వైర‌ల్ అవుతున్న బ్యాచిల‌ర్ పార్టీ వీడియో.!

 

 

[James Bond2026, RobertPattinson, NicholasHoult, DanielCraig, StevenKnight] 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com