
కరెక్ట్ గా తెరకెక్కిస్తే రాముడుకి వరల్డ్ బాక్స్ ఆఫీస్ ఏ విధంగా పట్టాభిషేకం చేస్తుందో రామాయణ నిరూపిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్టిల్ 823.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతున్న రామాయణ తాజాగా సౌత్ ఇండియా మార్కెట్లో ఓ అరుదైన మరియు చారిత్రాత్మక రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.
బాలీవుడ్ నుంచి వచ్చి సౌత్ భాషల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా 'రామాయణ' సరికొత్త మైలురాయిని అధిగమించింది. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే సౌత్ ఇండియన్ డబ్బింగ్ వెర్షన్ల ద్వారా ఏకంగా. 104.45 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. ఈ మొత్తం వసూళ్లలో దేశవ్యాప్తంగా నమోదైన నెట్ కలెక్షన్లలో కేవలం సౌత్ డబ్బింగ్ వెర్షన్ల వాటాయే దాదాపు 23.7% ఉండటం విశేషం.
దీనిని బట్టి హిందీ చిత్రాలకి సౌత్ మార్కెట్లో లభిస్తున్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా కన్నడ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా 41.20 కోట్లు రాబట్టి సౌత్ భాషల్లో అగ్రస్థానంలో నిలిచింది.
.webp)
కన్నడ తర్వాత తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. కేవలం తెలుగు వెర్షన్ ద్వారానే 33 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి. ఇక తమిళంలో 17.35 కోట్లు, మలయాళ వెర్షన్‌లో 12.90 కోట్ల మేర కలెక్షన్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి : మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: అన్నయ్య బరిలోకి దిగబోతున్నాడు..
దీపావళి పండుగ సీజన్ కావడంతో పాటు, ఇతర ప్రాంతీయ సినిమాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ సౌత్ భాషల్లో 'రామాయణ' సాధించిన ఈ వసూళ్లు అసాధారణమైనవిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా నైట్ షోలలో థియేటర్ల ఆక్యుపెన్సీ గణనీయంగా పెరగడం ఈ చిత్ర విజయానికి మరింత ఊతమిచ్చింది.
.webp)
గతంలో వచ్చిన హింది చిత్రాల లైఫ్‌టైమ్ సౌత్ డబ్బింగ్ కలెక్షన్ల రికార్డులను ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే తిరగరాసింది. 'ధురంధర్ 2' ( 68.54 కోట్లు), 'వార్ 2' ( 58.96 కోట్లు), 'జవాన్' (57.94 కోట్లు) వంటి చిత్రాల రికార్డులని అధిగమించి రామాయణ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
మీకు నచ్చవచ్చు:రాముడు ఆస్కార్ ని అందుకుంటాడా!
మీకు నచ్చవచ్చు: ఇయర్ ఎండ్ లో థియేటర్లని షేక్ చేయనున్న చిత్రాలు ఇవే!
[Ramayana South Collections, Ramayana Telugu Collections, Ramayana box office, Ramayana south collection, Ranbir Kapoor Ramayana,Telugucinema news, TeluguCinema, Tollywood, Tollywood News]





