Home

»

Latest News

జటాయు: చేతులు మారిన భారీ ప్రాజెక్ట్.. రోషన్ హీరోగా పాన్ ఇండియా మూవీ లాంచ్.!

Nov 11, 2026 2:34PM

దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి నుంచి సినిమా వస్తుందంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తుంటారు. అలాంటిది ఈసారి ఆయన ఏకంగా సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యంగ్ హీరో రోషన్ మేకతో ఆయన తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియా సినిమా ఈరోజు ఘనంగా ప్రారంభమైంది.

అశోక క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రేఖా పాండే తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, వినయ్ రాయ్ కీలక పాత్రలో నటించనున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా ప్రకటనతో ఇప్పుడు అందరిలోనూ ఒకటే ప్రశ్న.. ఇదేనా ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జటాయు’?

నిజానికి ‘జటాయు’ కథపై ఇంద్రగంటి మోహనకృష్ణ కొన్నేళ్లుగా వర్క్ చేస్తున్నారు. రామాయణంలోని జటాయువు పాత్ర చుట్టూ సాగే పౌరాణిక అంశాలతో, భారీ గ్రాఫిక్స్‌, యాక్షన్‌తో ఈ కథను తెరకెక్కించాలని ఆయన భావించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. మొదట ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో రూపొందించాలని అనుకున్నారు. అప్పట్లో హీరోగా విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించింది.

ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌లో మరికొందరు స్టార్ హీరోల పేర్లు కూడా వినిపించాయి. కానీ, ఆ కాంబినేషన్లు కార్యరూపం దాల్చలేదు. చివరకు రోషన్ దగ్గరకు ఈ కథ వచ్చిందని ఇటీవల ప్రచారం జరిగింది. ఇప్పుడు రోషన్, ఇంద్రగంటి కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియా సినిమా అధికారికంగా ప్రారంభం కావడంతో ‘జటాయు’ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.

ఇది కూడా చదవండి: హారిక హాసినితో త్రివిక్రమ్‌ బంధం తెగిపోనుందా?.. గాడ్ ఆఫ్ వార్ పరిస్థితి ఏంటి.?

అయితే ఈ సినిమా టైటిల్ ‘జటాయు’ అని మూవీ టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే గతంలో ప్రచారంలో ఉన్న దిల్ రాజు నిర్మాణం కాకుండా, తాజా ప్రకటనలో అశోక క్రియేషన్స్ పేరు కనిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ ‘జటాయు’నా లేక కొత్త కథనా? అన్నది తెలియాల్సి ఉంది.

ఏదేమైనా, ఇంద్రగంటి తనకు అలవాటైన సున్నితమైన కథల నుంచి బయటకు వచ్చి భారీ స్థాయి సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్‌ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. రోషన్‌ను ఈ సినిమాలో ఎలాంటి కొత్త అవతారంలో చూపించబోతున్నారు? ‘జటాయు’గానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మీకు నచ్చవచ్చు: 
రామ్ చరణ్ ‘RC17’లో రిషికాంత్?.. పూజకు వెళ్లిన అసలు కారణం చెప్పేశాడు.!
30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’.. కమల్ హాసన్ మేకప్ వెనుక అసలు కథ తెలుసా.?

 

 

 

[Roshan Meka Indraganti Mohana Krishna Movie, Jatayu Movie, Roshan Meka, Indraganti Mohana Krishna, Telugu Superhero Movie, Pan India Movie, Vijay Deverakonda, Telugu Film News, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com