
రామాయణ ఇంకా చూడలేదా! ఇప్పుడు ఎక్కడ విన్నా, ఈ పిలుపే.. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద రామాయణ సృష్టిస్తున్న ప్రభంజనం యొక్క చివరి అంకం ఎక్కడ ముగుస్తుందో తెలియని పరిస్థితి. కేవలం నాలుగు రోజులకే సాధించిన 499 .20 కోట్లే ఒక ఉదాహరణ.
నిన్న దివాలి రోజు ఆదివారం నాడు హైదరాబాద్ లో ఒక్క టికెట్ కూడా దొరకలేదంటే రామాయణ సునామి అర్ధం చేసుకోవచ్చు.
కేవలం బాక్సాఫీస్ వద్దే కాకుండా, ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ ‘బుక్‌మైషో’ (లో కూడా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. బుక్‌మైషోలో అత్యధిక పీక్ అవర్ ట్రెండింగ్ సాధించిన చిత్రాల జాబితాలో ‘రామాయణ’ ఏకంగా 1,11,830 ట్రెండింగ్‌తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
.webp)
ఈ రేసులో సంచలనం సృష్టించిన ‘ధురంధర్ 2’ (1,09,170), ‘పుష్ప 2’ (1,07,650), ‘కల్కి 2898 ఏడీ’ (95,710) వంటి భారీ చిత్రాలను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ఇది కూడా చదవండి: దీపావళి వేళ: ఆపరేషన్ తో చిన్నారి జీవితంలో వెలుగులు నింపిన సోనుసూద్
భారీ తారాగణం, గ్రాండ్ సెట్స్, అద్భుతమైన వీఎఫ్ఎక్స్ తో రూపొందిన ఈ చిత్రం రానున్న రోజుల్లో ఇంకెన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
.webp)
మీకు నచ్చవచ్చు: ఆదిపురుష్ రికార్డు అవుట్: బాక్స్ ఆఫీస్ ని రఫ్ఫాడిస్తున్న రామాయణ!
మీకు నచ్చవచ్చు: రామాయణ రివ్యూ
[Ramayana Creates Bookmyshow Records, Ramayana movie, Ramayana box office, Ranbir Kapoor Ramayana, Sai Pallavi, BookMyShow record, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]





