
సోనుసూద్... సినిమాకి, కళాకారులకి తన మానవతాదృక్పధంతో ఎనలేని కీర్తి ప్రతిష్టతలు తీసుకొస్తున్నాడు. తాజాగా మరో సారి మరోసారి తన అపారమైన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ దీపావళి పండుగ వేళ ఆయన చూపిన చొరవ ఒక నిరుపేద కుటుంబంలో నూతనోత్సాహాన్ని నింపింది.
తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఏడాది వయసున్న చిన్నారి రాధిక ప్రాణాలను కాపాడి, ఆ కుటుంబానికి ఈ ఏడాది దీపావళిని జీవితంలో ఎప్పటికీ మరువలేని తీపి జ్ఞాపకంగా మార్చారు.ముంబైకి చెందిన కేవలం 1 సంవత్సరం వయసున్న చిన్నారి రాధిక తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతోంది. పుట్టిన కొద్ది రోజులకే ఆ పాప ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య ఆ కుటుంబం యొక్క సంతోషాన్ని పూర్తిగా హరింపజేసింది. నిరుపేదరికంతో సతమతమవుతున్న ఆ కుటుంబానికి ఖరీదైన వైద్య చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేదు.
ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ ఆపసోపాలు పడి, ఉన్న చిన్నపాటి వనరులను ధారపోసినా ఆ పాప ప్రాణాలను నిలబెట్టడం అసాధ్యంగా మారింది. ఈ క్లిష్ట సమయంలో ఆ పసిపాపను బతికించుకోవడానికి 90 ఏళ్ల ఆ పిల్లాడి ముత్తైదువైన బామ్మ ముందుకు కదిలింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మనవరాలి ప్రాణాలని దక్కించుకోవడానికి ఆమె పడ్డ తపన, కళ్లలో నిండిన కన్నీళ్లు ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేసేలా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఆదిపురుష్ రికార్డు అవుట్: బాక్స్ ఆఫీస్ ని రఫ్ఫాడిస్తున్న రామాయణ!
వయసు పైబడినప్పటికీ ఏమాత్రం వెనకాడకుండా, ఎంతోమంది ఆపన్నులను ఆదుకున్న సోనూసూద్‌ని నేరుగా కలిసేందుకు ఆ 90 ఏళ్ల బామ్మ ఎంతో కష్టపడి ప్రయత్నించింది. ఎట్టకేలకు సోనూసూద్‌ను కలిసి తన మనవరాలి గుండె జబ్బు గురించి వివరిస్తూ, చిన్నారిని బతికించాల్సిందిగా కన్నీటి పర్యంతమైంది. బామ్మ దీనగాథను, ఆ నూరేళ్ల వయసులోనూ ఆమె పడుతున్న వేదనను ఆలకించిన సోనూసూద్ చలించిపోయారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగారు. తన ఫౌండేషన్ సిబ్బందిని అప్రమత్తం చేసి, బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచారు.
చిన్నారి రాధికకు అత్యవసరమైన కార్డియాక్ సర్జరీ కోసం ముంబైలోని ప్రముఖ జూపిటర్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి, అక్కడి వైద్య నిపుణులతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ అశుతోష్ నేతృత్వంలోని ప్రత్యేక వైద్య బృందం ఆ పాపకి క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సని విజయవంతంగా నిర్వహించింది. పాప ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించడంతో ఆ కుటుంబంలో ఆనందభాష్పాలు వెల్లువెత్తాయి.

ఈ సంతోషకరమైన వార్తను సోనూసూద్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. "ఈ దీపావళికి దేవుడు నాకు ఇచ్చిన అత్యంత అందమైన బహుమతి ఈ చిన్నారి ప్రాణాలను కాపాడటమే. ఏడాది వయసున్న రాధిక చిన్న గుండెకు దేవుడి దయ వల్ల మరోసారి కొత్త జీవితం లభించింది. ఆ బామ్మ ముఖంలో కనిపించిన చిరునవ్వే నాకు ఈ పండుగ తెచ్చిన నిజమైన వెలుగు" అంటూ సోనూసూద్ ఉద్వేగానికి లోనయ్యారు.
మీకు నచ్చవచ్చు :సౌందర్య చనిపోయాక ఆ ఇంట్లో జరిగిన సంఘటన ఇదే!
మీకు నచ్చవచ్చు: రామాయణ మూవీ రివ్యూ
[Sonu Sood Saved Another Child During Diwali, Sonu Sood, Sonu Sood saves child, Diwali news, Sonu Sood foundation, heart surgery baby, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]





