
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్స్ చేసే సరదా సంభాషణలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, ‘ఇట్లు అర్జున’ హీరో అనీష్ మధ్య జరిగిన ఓ చిన్న చిట్‌చాట్ కూడా అలానే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా తన ఓల్డ్ లుక్స్‌పై ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘మీ యంగర్ వెర్షన్ కి మీరు ఒక విషయం చెప్పాలనుకుంటే ఏం చెబుతారు?’ అని అనీష్ అడగ్గా.. ‘నీలా ఫిట్‌గా ఉంటే బాగుండేది’ అంటూ ఎన్టీఆర్ నవ్వుతూ బదులిచ్చారు. యంగ్ ఏజ్‌లో కొంచెం బొద్దుగా ఉండేవాడినని, అప్పుడే బరువు తగ్గి సినిమాలు చేసి ఉంటే బాగుండేదేమోనని ఎన్టీఆర్ అన్నారు.
"మీరు అలా ఉన్నప్పుడు కూడా స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేశాం" అని అనీష్ అనగా.. "అది ప్రేమ. ప్రేమ వల్ల అలా అనిపిస్తుంది." అంటూ ఎన్టీఆర్ సరదాగా కామెంట్స్ చేశారు.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా ఉండేవారు. ముఖ్యంగా 'రాఖీ' సినిమా సమయంలో ఆయన మరీ బొద్దుగా కనిపించారు. ఆ తర్వాత నుంచి తన లుక్స్ పై కేర్ తీసుకొని.. 'యమదొంగ' నుంచి స్లిమ్ గా మారారు. ఇప్పుడు సిక్స్ ప్యాక్ తో ఇండియాలోనే ఫిట్టెస్ట్ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
ఇది కూడా చదవండి: సోషల్ మీడియా క్రూరమైనది.. నాగార్జున షాకింగ్ కామెంట్స్.!
ఇప్పుడు అనీష్ ఫిట్నెస్ను చూసి.. యంగ్ ఏజ్‌లో తాను కూడా ఇలా ఉండే బాగుండేదని ఎలాంటి మొహమాటం లేకుండా తారక్ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నాగార్జున సమర్పణలో వస్తున్న ‘ఇట్లు అర్జున’ సినిమాతో అనీష్ హీరోగా పరిచయమవుతున్నారు. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మహేశ్ ఉప్పాల దర్శకత్వం వహించారు. వెంకీ కుడుముల నిర్మించగా, థమన్ సంగీతం అందించారు. నవంబర్ 13న ‘ఇట్లు అర్జున’ థియేటర్లలో విడుదల కానుంది.
మీకు నచ్చవచ్చు:
‘గబ్బర్ సింగ్’పై శృతి హాసన్ కామెంట్స్.. తెలుగు సినిమాలను విమర్శించే హీరోయిన్లకు చురక.!
నందమూరి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ షూటింగ్ ఎప్పుడంటే.?
[Jr NTR About His Old Looks, Jr NTR Interview, NTR Itlu Arjuna Promotions, Jr NTR Fitness, Itllu Arjuna Movie, Jr NTR, Aniesh, Itlu Arjuna, Telugu Film News]






