
అందరూ అనుకున్నట్టుగానే రామాయణ వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద తన ప్రళయ మారుతాన్ని చూపిస్తూ ఉంది. చూపిస్తూ ఉండటమే కాదు రామాయణని సరిగా తెరకెక్కించడంలేదనే విమర్శకుల మౌత్స్ కి ఎవరు ఓపెన్ చేయలేని 'కీ' తో లాక్ చేసి పడేసింది.
పైగా దీపావళి పండుగకు ముందు రోజుల్లో పెద్ద సినిమాలు విడుదల కావడానికి మేకర్స్ కాస్త వెనకంజ వేస్తుంటారు. ఆ సెంటిమెంట్‌ని కూడా రామాయణ పూర్తిగా తుడిచిపెట్టేసింది. నవంబర్ 5 న విడుదలైన ఆదిపురుష్ టోటల్ రన్ లో వరల్డ్ వైడ్ గా 450 కోట్లు సాధించింది.
కానీ ఇప్పుడు రామాయణ కేవలం నాలుగు రోజుల్లోనే 499 .20 కోట్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.దీంతో సినీ ట్రేడ్ సర్కిల్స్ రాబోయే రోజుల్లో రామాయణ వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ నమోదు చేయడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది.
.webp)
దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి తమ అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. అలాగే రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటన సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.
ఇది కూడా చదవండి: ఈ వారం ఓటిటిలో 21 సినిమాలు: ఆ మూడు మాత్రం అసలు మిస్ కావద్దు!
వీరితో పాటు లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమాకు ప్రైమ్ ఫోకస్ నమిత్ మల్హోత్రా, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ యష్ సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరించారు.
.webp)
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మైలాజికల్ మాస్టర్‌పీస్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి.
మీకు నచ్చవచ్చు: శ్రీరాముడి వనవాసం 14 ఏళ్ళే!
మీకు నచ్చవచ్చు: పాపం సత్య రెమ్యునరేషన్ ఇదే!
[Ramayana Beats Adipurush Collections, Ramayana box office collection, Ranbir Kapoor Ramayana, Yash Ravana role, Sai Pallavi Sita, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]






