TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

మమ్ముట్టి చేసిందంతా ఏఐ అంట.. ఏమిటి ఈ సినీ బీభత్సం!

Nov 28, 2026 1:22PM


ఎంత మంది గొప్ప నటులు ఉన్నా,  వచ్చినా, పుట్టే అవకాశం ఉన్నా కూడా  నేను మీ కంటే పెద్ద నటుడునని సగర్వంగా చెప్పుకోగలడు మమ్ముట్టి. మరి పూర్తి కండిషన్ లో రన్ అవుతున్న  ఆ  ట్రాక్ రికార్డు చూస్తే పై మాటపై అనుమానం పెంచుకున్న అనుమాన పక్షులు ఎవరైనా ఉన్నా సరే మమ్మట్టి గొప్ప నటుడని ఒప్పుకోవాల్సిందే.

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తు వస్తున్న మమ్ముట్టి తాజాగా  చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమాలో కనీసం ఒక్కసారైనా డ్యాన్స్ చేయాలని తనకు కోరిక ఉండేదని.. కానీ ఇప్పుడు డ్యాన్స్ చేస్తే అది కూడా ఏఐతో చేసిన వీడియో అని ప్రేక్షకులు అనుకుంటారేమో అంటూ నవ్వులు పూయించారు.

ఏఐ డ్యాన్స్ రీల్స్ చూసి మమ్ముట్టి ఆశ్చర్యం!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ వీడియోల హవా నడుస్తోంది. ముఖ్యంగా సినీ హీరోలు, హీరోయిన్ల ఫొటోలు తీసుకుని వారు చేయని పనులు చేసినట్లు వీడియోలు రూపొందిస్తున్నారు. మమ్ముట్టి కూడా ఈ ఏఐ రీల్స్‌కు అతీతం కాదు. ఆయన డ్యాన్స్ చేస్తున్నట్లుగా రూపొందించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

 

ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మమ్ముట్టి ఆసక్తికరంగా స్పందించారు. తనకు ఎప్పటి నుంచో సినిమాలో డ్యాన్స్ చేయాలని కోరిక ఉందని, కానీ అది చాలా కష్టమైన పని అని చెప్పారు. ఇప్పుడు ఎంతో కష్టపడి నిజంగానే డ్యాన్స్ చేసినా.. అది ఏఐ వీడియో అని ప్రేక్షకులు అనుకుంటారని సరదాగా వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి:రామాయణ కలెక్షన్ల సునామీ: బాహుబలి 2 లైఫ్ టైం రికార్డు బ్రేక్!

నా డ్యాన్స్‌ని  కూడా నమ్మరేమో!

యువత ప్రస్తుతం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న ఏఐ టూల్స్‌ను ఉపయోగించి రకరకాల వీడియోలు, రీల్స్ తయారు చేస్తున్నారని మమ్ముట్టి తెలిపారు. తనను ఊహించని రీతిలో డ్యాన్స్ చేయిస్తున్న ఏఐ వీడియోలు చూసి తానే ఆశ్చర్యపోతున్నానని చెప్పారు. అందుకే నిజంగా డ్యాన్స్ చేసినా దాన్ని నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చని చమత్కరించారు.

ఏఐపై మమ్ముట్టి ఆందోళన కూడా!

అయితే మమ్ముట్టి వ్యాఖ్యల్లో కేవలం హాస్యం మాత్రమే కాదు.. ఏఐ భవిష్యత్తుపై ఆందోళన కూడా కనిపించింది. ప్రస్తుతం అమెరికా, చైనా వంటి దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఈ సాంకేతికతను సరైన వ్యక్తులు ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, అదే నియంతలు లేదా ఆధిపత్య ధోరణి ఉన్న వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు.

 

ఏఐ అనేది మనం సరదాగా మాట్లాడుకునే అంశం మాత్రమే కాదని, మనుషుల జీవితాలపై ప్రభావం చూపగల తీవ్రమైన ముప్పు అని  అభిప్రాయపడ్డారు. చివరకు మన కదలికలకి  కూడా నియంత్రించే స్థాయికి ఈ టెక్నాలజీ వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మొత్తానికి ఒకవైపు తన డ్యాన్స్‌పై సరదా వ్యాఖ్యలతో నవ్వించిన మమ్ముట్టి.. మరోవైపు ఏఐ దుర్వినియోగంపై చేసిన హెచ్చరికలతో అందరినీ ఆలోచింపజేశారు. నిజంగా ఏఐ టెక్నాలజీ ఎంత వేగంగా మారిపోతోందో ఆయన వ్యాఖ్యలు మరోసారి గుర్తుచేస్తున్నాయి. మమ్ముట్టి ప్రస్తుతం ధనుష్ తో కలిసి 'ఓం' తో థియేటర్స్ లో ఉన్నాడు.

 

మీకు నచ్చవచ్చు 

గురువాయూర్ ఆలయంలో ప్రముఖ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా!

భోగి ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్స్!

 

[Mammotty, Om, Dhanush, Ai, Dance]

 

google-ad-img