కేరళలోని గురువాయూర్ ఆలయంలో ప్రముఖ హీరోయిన్ భక్తి పాటలు: సెల్యూట్ కొడుతున్న ఫ్యాన్స్!
Nov 28, 2026 11:19AM

హీరోయిన్ అంటే ఏమనుకుంటున్నారు? హీరోయిన్ అనే అనుకుంటున్నామని అంటున్నారు కదు.. తనలో మల్టి టాలెంట్ పెర్ఫార్మ్ ఉంది. సినిమాల్లో కాదు నిజ జీవితంలో. మరి మీరే చూసేయండి.
ఒకప్పుడు వెండితెరపై సందడి చేసిన ముద్దుగుమ్మ శరణ్య మోహన్. తాజాగా కేరళలోని గురువాయూర్ ఆలయంలో భక్తి పాటలు ఆలపిస్తూ కనిపించింది. ఆమె గాత్రం విన్న భక్తులు, అభిమానులు ఫిదా అవుతున్నారు.
నటిగానే కాదు.. మంచి గాయని కూడా!
మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటి శరణ్య మోహన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి క్యూట్ లుక్స్, సహజమైన నటనతో అభిమానులని సంపాదించుకుంది.

అయితే శరణ్యలో నటన మాత్రమే కాదు.. సంగీత ప్రతిభ కూడా ఉందని తాజాగా బయటపడింది. కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె భక్తి పాటలు ఆలపించారు. ఎంతో ప్రశాంతంగా, భక్తి భావంతో ఆమె పాటలు పాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: నాగ చైతన్యలో ఈ మార్పు గమనించారా?చిన్న చిన్న విషయాలకే ఎందుకు కృంగిపోవాలి!
భక్తి పాటలతో ఆకట్టుకున్న శరణ్య
సినిమాల్లో కనిపించే గ్లామర్‌కు భిన్నంగా సంప్రదాయబద్ధమైన వాతావరణంలో శరణ్య కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె గాత్రంలో భక్తి భావం ఉట్టిపడటంతో వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నటిగా మాత్రమే తెలిసిన ఆమెకు సంగీతంలోనూ మంచి ప్రతిభ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
సినిమాలకు దూరంగా ఉన్నా.. అభిమానులకు దగ్గరగానే!
శరణ్య మోహన్ సినిమాల్లో చురుగ్గా కనిపించిన సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ సినిమాలకి దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నారు.

మొత్తానికి వెండితెరపై తన నటనతో మెప్పించిన శరణ్య మోహన్.. ఇప్పుడు భక్తి గీతాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె పాడిన పాటల వీడియో చూసిన అభిమానులు మాత్రం నటనతో పాటు సంగీతంలోనూ ఇంత ప్రతిభ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.మలయాళంలో మూడు, తమిళంలో రెండు చిత్రాల్లో బాలనటిగా కనిపించింది.
టీనేజ్‌లోకి వచ్చాక సహాయ పాత్రలు, తర్వాత హీరోయిన్ . తెలుగులో 'విలేజ్‌లో వినాయకుడు'లో హీరోయిన్గా చేసిన శరణ్య.. తర్వాత నాని 'భీమిలి కబడ్డీ జట్టు', 'కల్యాణ్ రామ్ కత్తి', 'హ్యాపీహ్యాపీగా' చిత్రాల్లోని కనిపించింది.
మీకు నచ్చవచ్చు
భోగి మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్!
మీ అభిమాన రొమాంటిక్ థ్రిల్లర్ ఓటిటిలోకి వచ్చింది!
[Saranya, Guruvayoor, villege lo vinyakudu, Tollywood]




