TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

భోగి ఫస్ట్ డే కలెక్షన్స్: శర్వానంద్ ఖాతాలో ఎంత వసూలైందంటే!

Nov 28, 2026 9:32AM

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి, సంపత్ నంది కలిసి నిన్న 'భోగి' తో థియేటర్స్ లో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఫస్ట్ డే టాక్ అయితే కాస్త తేడాగానే ఉంది. ఎక్కువ మంది నెగిటివ్ గా చెప్తున్నారు. అలా అని అందరు లేరులే. పాజిటివ్ గా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మనం మాత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ చూద్దాం.

ఏరియా కలెక్షన్స్
ఇండియా నెట్    :1.90 కోట్లు
ఇండియా గ్రాస్: 2.18 కోట్లు
ఓవర్సీస్ గ్రాస్: 35 లక్షలు
 టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్:  2.53 కోట్లు

ఇది కూడా చదవండి:పెదకాపు హీరో: చిరంజీవి ఊర మాస్ టైటిల్!

ట్రేడ్ అంచనాల ప్రకారమే ఆ కలెక్షన్స్. మేకర్స్ మాత్రం అధికారకంగా ఎక్కడ ప్రకటించలేదనే విషయాన్నీ గుర్తుంచుకోవాలి.మరి ఈ వీకెండ్ ని భోగి ఎలా ఉపయోగించుకుంటుందో కూడా చూడాలి. మార్కెట్ లో కొత్త బొమ్మ లేకపోవడం భోగి అదృష్టం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై రాధామోహన్ నిర్మించాడు. సంపత్ నందికి డైరెక్టర్ గా 'ఏమైంది ఈ వేళ' తో  తొలి అవకాశం ఇచ్చింది కూడా రాధా మోహన్ నే. 

మీకు నచ్చవచ్చు

భోగి రివ్యూ!

ఆస్కార్ బరిలో తెలుగు అమ్మాయిల సినిమా!

 

[Bhogi, Sharwanandh, Anupama Parameswaran, sampath nandi]

 

google-ad-img