TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

బయటపడిన ‘మైసా’ సీక్రెట్: రష్మిక సినిమా వాయిదాకు అసలు కారణం ఇదేనా.?

Nov 28, 2026 1:14PM

 

రష్మిక మందన్న నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమా ‘మైసా’. నవంబర్ 27న విడుదల కావాల్సిన ఈ మూవీ చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పటివరకు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనే చర్చ నడుస్తుండగా, ఇప్పుడు మరో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. సినిమా క్లైమాక్స్ విషయంలో మేకర్స్ సంతృప్తిగా లేరని, అందుకే వాయిదా వేశారని ప్రచారం జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ‘మైసా’ ఫైనల్ కాపీ చూసిన తర్వాత మేకర్స్‌కు క్లైమాక్స్ విషయంలో కొన్ని సందేహాలు వచ్చాయట. సినిమా చివర్లో ప్రేక్షకులకు మరింత బలమైన ఇంపాక్ట్ ఇవ్వాలంటే ఎండింగ్‌ను మార్చాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారట. ఇందుకోసం క్లైమాక్స్ సీక్వెన్స్‌ను మళ్లీ రీషూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది.

మరోవైపు ‘మైసా’ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అందుకే కేవలం విడుదల తేదీని దృష్టిలో పెట్టుకుని హడావుడి పడకుండా, సినిమా అవుట్‌పుట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు టాక్.

ఈ సినిమాలో రష్మిక ఇప్పటివరకు చేయని ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఉన్న కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో కూడా మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారనే మాట వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: కాకా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. విశ్వంభర పరిస్థితి ఏంటి.?

అయితే క్లైమాక్స్ రీషూట్, పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజంగానే ఎండింగ్ మార్చి మళ్లీ షూట్ చేస్తారా? ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికి ‘మైసా’ విడుదల ఆలస్యంపై ఇప్పుడు క్లైమాక్స్ రీషూట్ టాక్ ఆసక్తిని పెంచుతోంది. కొత్త ఎండింగ్‌తో రష్మిక సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.

మీకు నచ్చవచ్చు:
RC17 కాస్టింగ్ కాల్.. రామ్ చరణ్ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్.!
బాలకృష్ణకు సుమలత క్షమాపణలు.. ఆ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా.?

 

 

 

[Rashmika Mandanna, Mysaa Movie, Climax Reshoot, Pan India]

google-ad-img