
జస్టిస్ చౌదరిలో విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు 'చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో' అనే పల్లవితో కూడిన పాట పాడి తన న్యాయవాద వృత్తి యొక్క గొప్పతనాన్ని బలంగా చాటి చెప్తాడు. అందుకనేనేమో ఇప్పుడు సాక్షాత్తు సుప్రీం కోర్ట్ న్యాయమూర్తే తమ న్యాయవాదులని పెట్టి సినిమా తియ్యండనే పరిస్థితి.
బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు రాజ్‌పాల్ యాదవ్ తన నటనతో, విభిన్నమైన కామెడీ టైమింగ్‌తో కోట్లాది మంది ప్రేక్షకులను దశాబ్దాలుగా అలరించారు. దాదాపు 200 నుంచి 250 చిత్రాల్లో నటించి చెరగని ముద్ర వేసిన ఈ నటుడు, ప్రస్తుతం తెరపై వెలుగులు విరజిమ్మడం కంటే కోర్టు మెట్లు ఎక్కడంతోనే వార్తల్లో నిలుస్తున్నారు. 2010 నాటి ఆర్థిక వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు ఆయనను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. తాజాగా సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం రాజ్‌పాల్ యాదవ్‌కు ఇచ్చిన ఒక ఆసక్తికరమైన, అనూహ్యమైన సలహా ఇప్పుడు సినీ, న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: మహేష్ బాబు, లోకేష్ కనగరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ బజ్!
.webp)
రాజ్‌పాల్ యాదవ్ ఆవేదనను, ఆయన చెల్లింపుల తీరును పరిశీలించిన సీజేఐ సూర్యకాంత్, సుప్రీంకోర్టు హాలులోనే సరదాగా వ్యాఖ్యానిస్తూనే ఒక విలువైన మార్గదర్శనాన్ని ఇచ్చారు. "ఏదైనా కొత్త సినిమా తీస్తున్నారా? మంచి సినిమా తీసి ప్రజలను మళ్లీ ఎంటర్‌టైన్ చేయండి. మీ ప్రతిభతో జనాలను నవ్వించి, కోల్పోయిన ఇమేజ్‌ను మళ్లీ బిల్డ్ చేసుకోండి. కావాలంటే మా కోర్టులో కూడా అద్భుతంగా నటించే మంచి లాయర్లు ఉన్నారు, వాళ్లను కూడా మీ సినిమాలో పెట్టి ఓ మంచి సినిమా తీయండి" అంటూ నవ్వులు పూయించారు. చట్టపరమైన సంకెళ్లతో పోరాడుతున్న ఒక కళాకారుడికి, మళ్లీ తన సొంత కళ ద్వారానే సమాజంలో తన స్థానాన్ని, ప్రతిష్టను పునర్నిర్మించుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచించడం విశేషం. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సానుకూల పిలుపుతో రాజ్‌పాల్ యాదవ్ మళ్లీ మునుపటిలా హాస్యంతో వెండితెరపై మెరుస్తారో లేదో వేచి చూడాలి.
[Make Good Films Rebuild image supreme court cji tells rajpal yadav, Rajpal Yadav, Supreme Court, CJI Surya Kant, Telugu Cinema News, Telugu Cinema, Tollywood News, Tollywood]





.webp)
