Home

»

Latest News

మహేష్ బాబు, లోకేష్ కనగరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ బజ్!

Oct 8, 2026 2:49PM


వారణాసి తర్వాత  సూపర్ స్టార్ మహేష్ బాబు, సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ రూపుదిద్దుకోబోతోందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోను సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల లోకేష్ కనగరాజ్ నటించిన ‘DC’ చిత్రాన్ని వీక్షించిన మహేష్ బాబు, సోషల్ మీడియా వేదికగా లోకేష్ ని ఒక రేంజ్ లో పొగిడాడు. . ఈ పోస్ట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారడమే కాకుండా, వీరిద్దరి కాంబినేషన్ కు సంబంధించిన చర్చలకు ప్రధాన బలంగా నిలిచింది. 

లోకేష్ చెప్పిన ఒక వినూత్నమైన ఆక్షన్ లైన్ మహేష్ బాబుకు బాగా నచ్చిందని, దానికి మహేష్ సానుకూలంగా స్పందించాడనే ప్రచారం ఫిలింనగర్ వర్గాల్లో బలంగా సాగుతోంది.
మరోవైపు, లోకేష్ కనగరాజ్ ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే 'AA23' ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ చిత్ర థీమ్ మ్యూజిక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడమే కాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఉపయోగించేంతగా పాపులర్ అయింది. కానీ, ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో కలిసి 'రాకా' అనే భారీ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. 'రాకా' నిర్మాణం పూర్తవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో, ఈ ల్యాప్ గ్యాప్‌లో లోకేష్ కనగరాజ్ మహేష్ బాబు ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తారా లేదా 'ఖైదీ 2' పనుల్లోకి వెళ్తారా అనే సందేహాలు సినీ ప్రేమికులలో వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: రిలీజ్ ప్లానింగ్ లోపమా: ఓటీటీ రూల్స్ తెచ్చిన చిక్కులా!

 

ఒకవేళ లోకేష్ కనగరాజ్ మార్క్ హై-వోల్టేజ్ ఆక్షన్ డ్రామాలో  మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ జతకూడితే, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, వారణాసి విడుదల తర్వాత మహేష్ బాబు తీసుకోబోయే నిర్ణయంపై పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com