TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

‘కింగ్ 100’ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్.!

Nov 24, 2026 5:24PM

కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక 100వ సినిమా ‘కింగ్ 100’ విడుదల తేదీపై గత కొద్దిరోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 24న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతుందంటూ ప్రచారం జరగడంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే తాజాగా మేకర్స్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో ఈ వాయిదా వార్తలకు చెక్ పెట్టారు. సినిమా డిసెంబర్ 24నే థియేటర్లలోకి రానుందని మరోసారి స్పష్టం చేశారు.

నాగార్జున కెరీర్‌లో 100వ సినిమా కావడంతో ‘కింగ్ 100’పై మొదటి నుంచే ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో నాగ్ స్టైలిష్ లుక్, కథకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను చూపించారు. అప్పుడే డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే ఇటీవల సినిమా విడుదల తేదీ మారబోతుందనే ప్రచారం మొదలైంది. క్రిస్మస్ సీజన్‌లో పోటీ, సినిమా ప్రమోషన్ల విషయంలో కనిపిస్తున్న నిశ్శబ్దం వంటి కారణాలతో వాయిదా పడే అవకాశాలున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో నాగార్జున అభిమానులు సినిమా అనుకున్న తేదీకే వస్తుందా? లేదా? అని చర్చించుకున్నారు.

ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా విడుదల చేసిన 30 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో స్పష్టత ఇచ్చారు. బ్లాక్ సూట్‌లో నాగార్జున స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్‌తో డిసెంబర్ 24 విడుదల తేదీని మరోసారి గుర్తుచేశారు. దీంతో ఇప్పటివరకు వినిపించిన వాయిదా ప్రచారానికి చిత్ర బృందం సమాధానం ఇచ్చినట్లయింది.

ఇది కూడా చదవండి: నాగార్జునను ఆందోళనకు గురిచేసిన చైతు.. పోకిరి చూశాకే ఆ నిర్ణయం తీసుకున్నారు.!

ఈ సినిమాకు రా. కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. ‘కింగ్ 100’లో నాగార్జునతో పాటు టబు, అశోక్ సెల్వన్, ఐశ్వర్య రాజేష్, సుష్మిత భట్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగార్జున, టబు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తుండటం కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా టబు పోషిస్తున్న మహంతి ఝాన్సీ రాణి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ తీసుకొచ్చింది.

ఇటీవల నాగార్జున కూడా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, ఒక పాటతో పాటు కొంత ప్యాచ్‌వర్క్ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. ఈ నెలాఖరుకు ఫస్ట్ కాపీ సిద్ధమయ్యేలా పనులు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా విడుదల తేదీని దృష్టిలో పెట్టుకుని కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

మీకు నచ్చవచ్చు: 
శ్రీవిష్ణుపై నాని ఫ్యాన్స్‌ ఫైర్.. మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.!
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ టైటిల్.. అసలు సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్.!

 

 

 

[King 100, Release Date, December 24, Nagarjuna, Ra Karthik]

 

google-ad-img