TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

బాలికలపై లైంగిక వేధింపులు: ప్రముఖ నటుడికి జైలు శిక్ష!

Nov 24, 2026 5:25PM

క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా సత్తా చాటుతూ ఉన్నాడు ప్రముఖ మలయాళ నటుడు  శ్రీజిత్‌ రవి. ఇప్పుడు ఈ  నటుడికి కోర్టు షాక్ ఇచ్చింది. ఇద్దరు మైనర్ బాలికలకి  సంబంధించిన పోక్సో కేసులో ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ కేరళలోని త్రిసూర్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించడం ప్రధాన హాట్ టాపిక్.

2022 జూలై 4న కేరళలోని త్రిసూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన 2022 జూలై 4న జరిగింది. త్రిసూర్‌లోని అరనాట్టుకరలో ఇ‍ద్దరు బాలికలు పాఠశాల నుంచి తమ ఇంటికి తిరిగి వస్తుండగా, శ్రీజిత్ రవి తన కారులో వారిని వెంబడించాడ. ఆ తర్వాత అపార్ట్‌మెంట్ కార్ పార్కింగ్ ప్రాంతంలో వారిని చూస్తూ తన ప్రైవేట్ పార్ట్స్ ప్రదర్శిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై కేసు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో అతన్ని నటుడు శ్రీజిత్ రవిగా గుర్తించారు.

ఇది కూడా చదవండి: అజిత్ డేర్ డెవిల్ లో సిఎం క్యామియో: ఫ్యాన్స్ ని ఆపడం ఇక ఎవరి తరం కాదు! 
 

అయితే శ్రీజిత్ రవికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని, ఈ కేసు ఆయన సినీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటూ, శిక్షను తగ్గించాలన్న రవి తరపు న్యాయవాది అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. నిందితుడు ఇద్దరు పాఠశాల విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్నాడని.. ఈ ఘటన వల్ల వారిపై దీర్ఘకాలిక మానసిక ప్రభావం పడొచ్చని కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. రవి నుంచి జరిమానా వసూలు చేస్తే.. నష్టపరిహారంగా  ఇద్దరు బాలికలకు సమానంగా పంచాలని కూడా కోర్టు ఆదేశించింది. శ్రీజిత్ రవి తండ్రి కూడా ప్రముఖ నటుడు టీజీ రవి.

మీకు నచ్చవచ్చు 

భోగి  ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

బండ్ల గణేష్ మమ్మల్ని మోసం చేయలేదు: చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్!

 

[Sreejith Ravi POCSO Case, Mollywood, Tollywood, Tg Ravi]

 

google-ad-img