ఎన్టీఆర్ ‘డ్రాగన్’ టైటిల్: అసలు సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్.!
Nov 24, 2026 4:59PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘డ్రాగన్’. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి టైటిల్ విషయంలో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొదట్లో #NTRNeel పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రకటించగానే అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ పవర్ఫుల్ టైటిల్ వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉందని తాజాగా బయటపడింది.
ఈ టైటిల్‌ను ఎన్టీఆర్ సినిమాకు అందించింది మరెవరో కాదు.. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. గోవాలో జరుగుతున్న 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న అయాన్ ముఖర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా కోసం సరైన టైటిల్ వెతుకుతున్న సమయంలో తాము ‘డ్రాగన్’ పేరును వారికి ఇచ్చామని ఆయన చెప్పారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రణ్‌బీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు తొలుత ఈ ‘డ్రాగన్’ టైటిల్‌ను పెట్టాలని అయాన్ ముఖర్జీ భావించారట. ఆ సినిమా మొదట చిన్న కథగా ప్రారంభమైనప్పటికీ, క్రమంగా భారీ బడ్జెట్‌తో విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత ఉన్న ఫాంటసీ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంది. దీంతో కథ, సినిమా పరిధి పెరిగిన నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ అనే పేరును ఖరారు చేశారు.

అలా ‘బ్రహ్మాస్త్ర’ కోసం అనుకున్న ‘డ్రాగన్’ పేరు ఉపయోగించకుండా మిగిలిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం టైటిల్ వెతుకుతున్న సమయంలో అయాన్, కరణ్ జోహార్ ఆ పేరును చిత్ర బృందానికి అందించారు. ఈ విషయాన్ని అయాన్ స్వయంగా వెల్లడించడంతో ఇప్పుడు ఈ టైటిల్ వెనుక ఉన్న కథ సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఇది కూడా చదవండి: రెండేళ్లుగా ఎదురుచూపులు.. ఎట్టకేలకు దేవర శాటిలైట్ రైట్స్ సోనీ చేతికి.!
ఇక ‘డ్రాగన్’ సినిమా విషయానికి వస్తే.. 1967 నేపథ్యంలో సాగే ఈ కథలో నల్లమందు వ్యాపారం, దాని చుట్టూ ఏర్పడే ఆధిపత్య పోరాటం ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. ఎన్టీఆర్ ఇందులో లూగర్ అనే పాత్రలో కనిపించనున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఎన్టీఆర్ లుక్, ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి.

‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో తనదైన యాక్షన్ ప్రపంచాన్ని సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఈసారి ఎన్టీఆర్‌ను ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల కానుంది.
మీకు నచ్చవచ్చు:
మహేష్ ఫ్యాన్స్‌కి షాక్.. వారణాసి కొత్త రిలీజ్ ప్లాన్ ఇదే.!
మమితా బైజు అసభ్యకర AI వీడియో.. సోషల్ మీడియాలో వైరల్.!
[Jr NTR, Dragon Title Story, Ayan Mukerji, Karan Johar, Prashanth Neel]




