Home

»

Latest News

విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన కిచ్చా సుదీప్ దంపతులు.. మళ్లీ ఎలా ఒకటయ్యారు!

Oct 22, 2026 11:57AM

 

హై వోల్టేజ్ పెర్ఫార్మ్ చెయ్యగల నటుల్లో కిచ్చా సుదీప్ ఒకరు. ప్రస్తుతం తెలుగు నిర్మాత హనుమాన్, సంబరాల యేటి గట్టు ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తో ఒక సినిమా చేస్తున్నాడు.  సుదీప్ వ్యక్తిగత విషయానికి వస్తే రీసెంట్ గా తన భార్యతో కలిసి 25 వ (అక్టోబర్ 18 ) వార్షికోత్సవాన్ని జరుపుకున్నాడు.  

ఈ సందర్భంగా  వార్షికోత్సవ వేడుకని  ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ వేడుకలో సుదీప్, ప్రియ సరదాగా ఒకరికొకరు పూలమాలలు మార్చుకున్న క్షణాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రియ సిగ్గుపడుతూ సుదీప్‌కు పూలమాల వేయమని కోరడం, సుదీప్ ఎంతో ప్రేమగా ఆమెకు మాల వేయడం, ఆ తర్వాత ప్రియ ఆయనకు మాల వేయడం వంటి అపురూప దృశ్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.   అయితే, ఈ సుందరమైన క్షనాల వెనుక ఒకప్పుడు ఎంతో బాధాకరమైన గతం కూడా ఉంది. ఈ దంపతుల ప్రయాణంలో ఒకానొక దశలో మనస్పర్థలు తలెత్తాయి. పెళ్లయిన 14 సంవత్సరాల తర్వాత, అంటే 2015వ సంవత్సరంలో విభేదాల కారణంగా ఈ జంట విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. అప్పట్లో ఈ వార్త సినీ పరిశ్రమను, అభిమానులని దిగ్భ్రాంతికి గురిచేసింది. 

చట్టపరంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఆ సమయంలో, సుదీప్ ఒక నిర్ణీత మొత్తంలో భరణం చెల్లించడానికి మరియు తమ ముద్దుల కుమార్తె సాన్వి సంరక్షణ బాధ్యతని ప్రియకి అప్పగించడానికి అంగీకరించారు. అప్పటికి  సాన్వి వయసు 11 ఏళ్ళు. . కానీ కాలం మారుతున్న కొద్దీ వారిద్దరి మధ్య ఉన్న పాత బంధం, బాధ్యతలు మరోసారి ఆలోచింపజేశాయి.  ఒకరికొకరు దూరంగా ఉండలేమని గ్రహించిన ఈ జంట, విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భావించారు. అలా 2017వ సంవత్సరంలో కర్ణాటక కోర్టులో తాము విడాకుల పిటిషన్‌ని ఉపసంహరించుకుంటున్నట్లు లిఖితపూర్వకంగా తెలిపారు. కోర్టు ద్వారా విడాకుల వరకు వెళ్లిన ఈ జంట, తమ పాత మనస్పర్థలను పూర్తిగా పక్కనపెట్టి మళ్లీ ఒక్కటయ్యారు. తమ కాపురానికి మరో అద్భుతమైన అవకాశం ఇచ్చి, అన్యోన్యంగా జీవిస్తూ నేడు విజయవంతంగా 25 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. విడాకుల అంచు నుంచి రీకన్సిలేషన్ వరకు సాగిన వీరి ప్రయాణం నేటితరానికి ఒక పెద్ద సందేశాన్ని ఇస్తోంది. 

 

 

ఇది కూడా చదవండి: భయం గుప్పిట్లో బాలీవుడ్!: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ రెక్కీలతో వణికిపోతున్నసెలబ్రిటీలు! 

అందుకే అంటారు జీవితానికి సంబంధించిన కఠినమైన నిర్ణయం తీసుకునే ముందు మౌత్, మైండ్ కి పని చెప్పకుండా వెయిట్ చెయ్యాలని. ఎందుకంటే వెయిటింగ్ అనేది అతి పెద్ద గురువు, ఆప్త మిత్రుడు, శ్రేయోభిలాషి. అన్నిటిని చక్కబెడుతుంది. అక్టోబర్ 18, 2001న ఆ ఇద్దరి వివాహం జరిగింది.

 

[kichcha Sudeep 25th Wedding Anniversary, Kichcha Sudeep, Priya Sudeep, 25th Wedding Anniversary, sandil wood,  Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com