
సినిమాలో ట్విస్ట్‌ను ముందే కనిపెట్టడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాల్లో అసలు విషయం ఏంటో చివరి వరకు సస్పెన్స్‌లో ఉంచితేనే ప్రేక్షకులకు కిక్ ఉంటుంది. అయితే తన సినిమా ట్విస్ట్‌ను కనిపెట్టిన వారికి ఏకంగా కోటి రూపాయలు ఇస్తానంటూ ఓ దర్శకుడు సవాల్ విసిరారు. స్టేజ్‌పై కేవలం మాటలు చెప్పడమే కాదు.. ఏకంగా కోటి రూపాయల చెక్‌తో తన ఛాలెంజ్‌ను ప్రకటించారు.
ఆ దర్శకుడు మరెవరో కాదు.. సుకు పూర్వాజ్. ఆయన దర్శకత్వంలో జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కిల్లర్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సుకు పూర్వాజ్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
‘కిల్లర్’ సినిమా ఫస్ట్ హాఫ్ సుమారు గంటసేపు ఉంటుందని సుకు పూర్వాజ్ వెల్లడించారు. కథలోని విభిన్నమైన అంశాలు ప్రేక్షకులను తమతో పాటు ప్రయాణించేలా చేస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో ఎవరూ ఊహించని భారీ ట్విస్ట్ ఉంటుందని, ‘ఆమె ఎవరు?’ అనే ప్రశ్నతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుందని వివరించారు.
సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఒక వాట్సాప్ నంబర్‌ను అందిస్తామని, సినిమా మొదటి షో చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ పడిన ఐదు నిమిషాల్లోపు సెకండాఫ్‌లో వచ్చే కీలకమైన ట్విస్ట్ లేదా క్లూను కనిపెట్టి ఆ నంబర్‌కు పంపించాలని ఆయన తెలిపారు. సరైన సమాధానం చెప్పిన వ్యక్తికి సినిమా సక్సెస్ మీట్ రోజున కోటి రూపాయలు అందిస్తానని ప్రకటించారు.

సాధారణంగా సినిమా ఫ్లాప్ అయితే ఇండస్ట్రీని వదిలేస్తామని, షర్ట్ విప్పేస్తానని, గుండు కొట్టించుకుంటానని.. ఇలా రకరకాలుగా దర్శకులు సవాళ్లు విసరడం చూస్తుంటాం. కానీ సుకు పూర్వాజ్ మాత్రం అందుకు భిన్నంగా తన సినిమా కథలోని ట్విస్ట్‌నే ఛాలెంజ్‌గా మార్చేశారు.
సైన్స్ ఫిక్షన్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ‘కిల్లర్’లో జ్యోతి పూర్వాజ్ విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. సుకు పూర్వాజ్ దర్శకత్వంతో పాటు నటించారు కూడా. ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలోకి రానుంది. మరి ఆయన ప్రకటించిన కోటి రూపాయల ఛాలెంజ్‌ను ఎవరైనా గెలుచుకుంటారా లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: నా మనసునే మీటకే నేస్తమా.. సిరివెన్నెల ఎంత గొప్పగా రాశారో.!
[Killer Director Poorvaj 1 Crore Challenge, Killer Movie Twist, Killer Movie 1 Crore Challenge, Director Suku Purvaj, Jyothi Poorvaj, Killer Movie, Telugu Movies 2026, Telugu Film News]






