టాలీవుడ్‌లో వరుసగా పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. హీరోలు సాయిధరమ్ తేజ్, తేజ సజ్జా త్వరలోనే తమ ప్రియురాళ్లతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు కన్నడ నటి కావ్య కళ్యాణ్ రామ్ కూడా పెళ్లి చేసుకున్నారు. రీసెంట్‌గా ‘ఇరుముడి’ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ జాబితాలో మరో హీరోయిన్ కూడా చేరేందుకు సిద్ధమైంది.
ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన తమిళ హీరోయిన్ మృణాళిని రవి త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. పుదుచ్చేరికి చెందిన ఈమె 2019లో వచ్చిన విజయ్ సేతుపతి ‘సూపర్ డీలక్స్’ సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అలా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’తో పాటు ‘హ్యాపీడేస్’ తదితర చిత్రాల్లో నటించింది. తమిళంలో ‘చాంపియన్’, ‘ఎనిమి’, ‘ఎక్స్‌ట్రా’, ‘జంగో’, ‘కోబ్రా’ వంటి సినిమాలు చేసింది. చివరిగా 2024లో వచ్చిన ‘రోమియో’ అనే తమిళ చిత్రంలో కనిపించింది. ఇలా దక్షిణాది సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మృణాళిని కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటోంది.
గత రెండేళ్లుగా యాక్టింగ్‌కు దూరంగా ఉన్న ఈమె ఉన్నట్టుండి తన నిశ్చితార్థం విషయాన్ని బయటపెట్టింది. మలేషియాకు చెందిన మహావిష్ణు అనే ఆధ్యాత్మిక గురువుతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నప్పటి నుంచి మృణాళిని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ‘దాదా’ సాంగ్ వైరల్: బావలే బావలే ఇక్కడున్న వాళ్లంతా బావలే!
నిశ్చితార్థం తర్వాత ఆమె కొత్త సినిమాలేవీ ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమాల కంటే వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుండటంతో ఇటీవల తన స్నేహితులకు బ్యాచిలర్స్ పార్టీ ఇచ్చారు మృణాళిని. ఈ పార్టీ వెన్యూని మహావిష్ణు, మృణాళిని ఫోటోలతో అందంగా అలంకరించారు. తన స్నేహితులతో ఆడి, పాడి సందడి చేశారు మృణాలిని. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం సినిమాల కంటే వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుండటంతో మృణాళిని అభిమానులు ఆమె వివాహం గురించి మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నారు.
నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాళిని రవి, ఇప్పుడు జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ఇంతకీ ఆమె పెళ్లి ఎప్పుడు జరగనుంది? వివాహం తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తుందా? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
మీకు నచ్చవచ్చు:
‘రామాయణ’ బాక్సాఫీస్ ప్రభంజనం.. ఆ మూడు సినిమాల రికార్డులు గల్లంతు!
‘దొంగ నాకొడుకు’ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్!
[MrinaliniRavi, MrinaliniRaviWedding, Mahavishnu, GaddalakondaGanesh, SuperDeluxe]





.webp)
