Home

»

Latest News

నాలుగు రోజుల కలెక్షన్స్ ఇవే: అర్థమైందా రాజా!

Oct 19, 2026 12:44PM


టైగర్ ముత్తు వేల్ పాండియన్ సెల్యులాయిడ్ వద్ద తన ప్రభంజనానికి ఒక్క సీట్ కి  కూడా రెస్ట్ ఇవ్వకుండా దూసుకుపోతున్నాడు. దీంతో నాలుగు రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్ తన వశమవుతున్నాయి. ఒక రకంగా టైగర్ కా హుకుం అంటూ కలెక్షన్స్ నే దాసోహమవుతున్నాయని చెప్పవచ్చు.

విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 424.25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. మొదటి రోజే ఇండియాలో  59.70 కోట్ల నెట్ కలెక్షన్లతో ఆరంభమైన ఈ చిత్రం, రెండవ రోజు 37.10 కోట్లు, మూడవ రోజు శనివారం 47.25 కోట్లను రాబట్టింది. ఆ తర్వాత ఆదివారం నాడు అనూహ్య రీతిలో ఏకంగా 18.2 శాతం వృద్ధి నమోదు చేస్తూ భారతదేశంలో  55.85 కోట్ల భారీ నెట్ కలెక్షన్‌ను దక్కించుకుంది. ఈ కలెక్షన్ల సునామీతో కేవలం నాలుగు రోజుల్లోనే ఇండియా నెట్ కలెక్షన్స్199.90 కోట్లకు చేరుకోగా, డొమెస్టిక్ గ్రాస్ వసూళ్లు 234.25 కోట్లను దాటేశాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా టైగర్ ముత్తువేల్ పాండియన్ తన క్రేజ్‌  చాటుకున్నాడు. అంతర్జాతీయ మార్కెట్లో జైలర్ 2 నాలుగు రోజుల్లో సాధించిన మొత్తం ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ ఏకంగా190 కోట్లు. కేవలం ఒక్క ఆదివారమే ఓవర్సీస్ నుంచి  40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయంటే విదేశాల్లో తమిళ రజినీ ఫీవర్  ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 


ఇది కూడా చదవండి: ఊహకందని క్రియేటివిటీ ఈ మూవీ!. డోంట్ మిస్.. ఏ ఓటిటిలో ఉందంటే! 

 

వివిధ భాషల విషయానికి వస్తే, ఆదివారం ఒక్కరోజే తమిళ వెర్షన్ 8,173 షోల ద్వారా 39.95 కోట్ల నెట్ సాధించగా, తెలుగు వెర్షన్ 2,234 షోలలో 64.3 శాతం ఆక్యుపెన్సీతో 9.50 కోట్ల నెట్ వసూలు చేసింది. హిందీ బెల్ట్‌లో 4,902 షోల నుంచి  5.75 కోట్లు, కన్నడలో 0.65 కోట్లు రాబట్టింది. నాలుగు రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా ఏకంగా 1,30,21,526 మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను వీక్షించడం విశేషం.   కమల్ హాసన్ ‘విక్రమ్’ సాధించిన 414.43 కోట్ల ఆల్ టైమ్ వరల్డ్ వైడ్ రికార్డును సైతం జైలర్ 2 కేవలం నాలుగు రోజుల్లోనే దాటేసి, అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాల జాబితాలో టాప్ 7వ స్థానానికి చేరుకుంది.

 

[Jailer 2 collections, jailer 2 Four days collections, Rajinikanth Jailer 2 box office, Jailer 2 day 4 collections, Jailer 2 worldwide gross, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu news]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com