Home

»

Latest News

అల్లు అర్జున్,లోకేష్ కనగరాజ్ మూవీ టైటిల్ ఇదేనా: ఆ స్టార్ అంట!

Nov 11, 2026 4:13PM


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోకి ఉండే క్రేజ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. అంచనాలని అందుకోవాలంటే ఏదైనా కొత్త పరికరం కనిపెట్టాల్సిన పరిస్థితి.


ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం AA23పై రోజుకో సరికొత్త అప్‌డేట్ సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. తాజా ఫిలింనగర్ సర్కిల్స్ సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి మేకర్స్ ఒక పవర్‌ఫుల్ వర్కింగ్ టైటిల్‌గా 'గ్యాంగ్‌స్టార్' (Gangster) అనే పేరును లాక్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. లోకేష్ కనగరాజ్ మార్క్ రక్తపాతం, తుపాకీల చప్పుడు, మరియు పూర్తిగా రా అండ్ రస్టిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో ఈ కథ నడవనుందని సినీ వర్గాలు అంటున్నాయి. 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని సరికొత్త మాస్ షేడ్స్‌లో అల్లు అర్జున్‌ను దర్శకుడు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు లోకేష్ స్టైలిష్ డార్క్ యాక్షన్ ఎలిమెంట్స్, మరోవైపు బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్ తోడవడంతో థియేటర్లలో పూనకాలు ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర గానీ, రొమాంటిక్ ట్రాక్ గానీ ఉండే అవకాశం లేదని, పూర్తిగా ఇంటెన్స్ యాక్షన్ మరియు ఎమోషన్స్‌కే పెద్దపీట వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

 

ఇది బన్నీ కెరీర్‌లోనే ఒక సరికొత్త ప్రయోగంగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా మరియు అత్యంత గోప్యంగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రాకా' చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: రాముడికి పట్టాభిషేకం చేసిన సౌత్ ప్రేక్షకులు: కలెక్షన్స్ ఇవే!

ఆ షెడ్యూల్స్ ముగిసిన వెంటనే బన్నీ ఈ లోకేష్ ప్రాజెక్ట్‌పై పూర్తి దృష్టి పెట్టనున్నారు. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి ఈ టైటిల్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదా అదిరిపోయే టీజర్ రానుందని సమాచారం. అటు మాస్ డైరెక్టర్, ఇటు ఐకాన్ స్టార్ కలయికలో రాబోతున్న ఈ 'గ్యాంగ్‌స్టార్' ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి! 

 బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ , సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మాణ భాగస్వామ్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్. 

 

మీకు నచ్చవచ్చు: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
మీకు నచ్చవచ్చు :కమల్ హాసన్ సరికొత్త వివాదం: ఆ కులం వాళ్ళు ఇబ్బందిపడతారేమో!

 

[Allu Arjun And Lokesh Kanagaraj Movie Title, AA 23 Gangster Title, Allu Arjun, Lokesh Kanagaraj, AA23 movie, Gangster title, Telugucinema news, TeluguCinema, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com