
బాలీవుడ్ కి సరికొత్త ఊపిరిని ఇవ్వడంతో పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించింది ధురంధర్ సిరీస్. ఈ ఘనతకి ప్రధాన ఆద్యుడు దర్శకుడు ఆదిత్య ధర్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. దీంతో ఆదిత్య ధర్ కొత్త మూవీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అప్ కమింగ్ మూవీ ఇదే అంటూ తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది.
ధురంధర్ హీరో రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ మరోసారి చేతులు కలపబోతున్నట్లు సమాచారం. . ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి ఎలాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్ కాకుండా పూర్తిగా విభిన్నమైన పౌరాణిక, చారిత్రక నేపథ్యంతో కూడిన భారీ మైథలాజికల్ యాక్షన్ డ్రామాని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోందని, 2027 సంవత్సరంలో షూటింగ్ ప్రారంభించి 2028 డిసెంబర్ నాటికి ఈ సినిమాను థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ఓం రిలీజ్ వేళ ఫ్యాన్స్ కి ధనుష్ నుంచి సరికొత్త పిలుపు: సీఎం విజయ్ ఏం చేసాడయ్యా!

మౌర్య సామ్రాజ్య నేపథ్యాన్ని లేదా పురాణ గాథలని ఆధారంగా చేసుకుని ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాలని ఆదిత్య ధర్ భావిస్తున్నారట. కేవలం సాధారణ వినోదమే కాకుండా, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి.

అయితే, గతంలో ఆదిత్య ధర్ తెరకెక్కించాలనుకుని ఆగిపోయిన 'అశ్వత్థామ' ప్రాజెక్ట్‌ను మళ్లీ రీవిజిట్ చేస్తున్నారా లేక పూర్తిగా కొత్త మైథలాజికల్ కథతో వస్తున్నారా అనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మీకు నచ్చవచ్చు:విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్: ఫ్లాప్ మూవీకి సక్సెస్ మీట్!
మీకు నచ్చవచ్చు: చిరంజీవితో రోజా మూవీ: ఆ రోజు ఏం జరిగిందంటే.. ప్రముఖ రచయిత వ్యాఖ్యలు వైరల్!
[Aditya Dhar,Ranveer Singh, mythological, Mourya Chakravarthy]






