Home

»

Latest News

ఓం రిలీజ్ వేళ ఫ్యాన్స్ కి ధనుష్ నుంచి సరికొత్త పిలుపు: సీఎం విజయ్ ఏం చేసాడయ్యా!

Nov 18, 2026 5:35PM

ఈ నెల 20 న స్టార్ హీరో ధనుష్ 'ఓం' మూవీతో సెల్యులాయిడ్ పై ల్యాండ్ అవుతున్న విషయం తెలిసిందే. మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ధనుష్ తో జాయిన్ కావడంతో స్క్రీన్ సరికొత్తగా  మెరవనుంది.

ధనుష్  తాజాగా రిలీజ్‌కు ఒక్క రోజు ముందు ధనుష్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన ఒక స్పెషల్ నోట్ సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. సినిమా విడుదల సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయంపై ధనుష్ తన అపారమైన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటల ప్రత్యేక షో (Early Morning Show) నిర్వహించుకునేందుకు అనుమతిచ్చినందుకు తమిళనాడు ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎంకు ధనుష్ తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

అయితే ఎర్లీ మార్నింగ్ షోల అనందంలో మునిగిపోకుండా, తన అభిమానులకి  ధనుష్ ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్ కూడా చేశారు. “ఉదయం 6 గంటల షోకు థియేటర్లకు వచ్చే ఫ్యాన్స్ అందరూ ప్రభుత్వ సేఫ్టీ రూల్స్ తూచా తప్పకుండా పాటిస్తూ, ఎంతో బాధ్యతగా నడుచుకోవాలి.

పక్కవాళ్లకు లేదా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం మన బాధ్యత. థియేటర్లో సినిమాని  ప్రశాంతంగా చూసి ఎంజాయ్ చేయడమే అసలైన సెలబ్రేషన్” అంటూ ధనుష్ తన పోస్ట్‌లో హితవు పలికారు.  

ఇది కూడా చదవండి:ఫ్లాప్ మూవీకి సక్సెస్ మీట్.. విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్ వైరల్!


సినిమా వెనుక ఉన్న ఎంతోమంది కార్మికుల కష్టాన్ని ధనుష్ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ఏదైనా ఒక సినిమా ఘనవిజయం సాధించ వెనుక ఎన్నో విభాగాలకు చెందిన వందలాది మంది టెక్నీషియన్లు, సినీ కార్మికుల హార్డ్‌వర్క్, డెడికేషన్ దాగి ఉంటాయని,అలాంటి శ్రమజీవులందరికీ ఆడియన్స్ ఇచ్చే అతిపెద్ద సపోర్ట్ కేవలం పైరసీని అరికట్టడం మాత్రమే కాదని, థియేటర్లకు భారీ సంఖ్యలో వెళ్లి సినిమాలు చూడటమేనని  పిలుపునిచ్చారు.

మీకు నచ్చవచ్చు: ధోని ఫస్ట్ లవ్ మన తెలుగు హీరోయిన్ నేనా!
మీకు నచ్చవచ్చు:వారణాసి తర్వాత మహేష్ చేసే మూవీ ఇదే!

 

 

[Dhanush, Om, Mammotty, Sai Pallavi, Sreeleela, Tollywood, Kollywood]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com