Home

»

Latest News

విలన్‌గా గోపీచంద్ రీఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన టీమ్.!

Nov 18, 2026 6:16PM

కోలీవుడ్ స్టార్ సూర్య సినిమాలో టాలీవుడ్ హీరో గోపీచంద్ విలన్‌గా నటించబోతున్నారంటూ వచ్చిన వార్తలకు తెరపడింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని గోపీచంద్ టీమ్ అధికారికంగా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వెల్లడించింది.

ఇటీవల సూర్య 49వ సినిమాలో గోపీచంద్ విలన్‌గా కనిపించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ సినిమాల్లో విలన్‌గా మెప్పించిన గోపీచంద్.. మళ్లీ అదే తరహా పాత్రలో కనిపిస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఆశించారు. ముఖ్యంగా సూర్యతో తలపడే పాత్రలో ఆయన నటిస్తారనే ప్రచారం ఆసక్తి రేపింది.

అయితే ఈ వార్తలపై తాజాగా గోపీచంద్ టీమ్ స్పందించింది. రాబోయే తమిళ సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా తప్పు అని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ని కోరింది.

అంతేకాదు.. గోపీచంద్ తదుపరి సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు, అప్‌డేట్స్ ఏవైనా ఉంటే తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే వెల్లడిస్తామని తెలిపింది. దీంతో సూర్య సినిమాలో గోపీచంద్ విలన్ అనే ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడినట్లయింది. 

ఇది కూడా చదవండి: మళ్ళీ విలన్‌గా గోపీచంద్.. జయం, వర్షం రోజులు గుర్తొస్తాయా.?

కాగా, ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘భరతవర్ష’ ఒకటి. మరో సినిమా 'సింగ' వెంకట్ దర్శకత్వంలో రూపొందుతోంది.

మీకు నచ్చవచ్చు: 
ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.!
తను మాట్లాడలేదు.. చిరు నోటి నుంచి బయటపడ్డ అసలు సీక్రెట్.!

 

 

 

[Gopichand, Villain Role, Suriya 49, Bharata Varsha, Singa Movie]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com