Home

»

Latest News

ఫ్లాప్ మూవీకి సక్సెస్ మీట్.. విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్ వైరల్!

Nov 18, 2026 5:07PM


విశ్వక్ సేన్ మరి కాసేపట్లో  ENE రిపీట్ ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 పెయిడ్ ప్రీమియర్స్ తో థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. వరల్డ్ రిలీజ్ రేపు. తాజాగా విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

తాజాగా విశ్వక్ తన కల్ట్ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు .ఇటీవల విశ్వక్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా కల్ట్ సినిమాని తెరకెక్కించాడు. కొత్త పాయింట్ తో సర్వైవల్ థ్రిల్లర్ గా  తెరకెక్కింది. పాయింట్ బాగున్నా వైలెన్స్ ఎక్కువ ఉండటంతో ప్రేక్షకులకి  అంతగా కనెక్ట్ అవ్వలేదు. దీంతో  ఫ్లాప్ గా మిగిలింది.

20 కోట్ల పైగా గ్రాస్ రావాల్సి ఉండగా కేవలం 6 కోట్లు మాత్రమే వచ్చాయి కల్ట్ సినిమాకి రిలీజ్ తర్వాత ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. రిలీజ్ నెక్స్ట్ డే ఒక ప్రెస్ మీట్ అనౌన్స్ చేసి చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసారు.

ఇది కూడా చదవండి:ధోనితో బ్రేకప్ చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా.. కారణం అదేనంట!

ఇప్పుడు  ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కల్ట్ సక్సెస్ మీట్ ఎందుకు పెట్టలేదు అని అడగ్గా విశ్వక్ మాట్లాడుతూ.. టైం లేదు. కల్ట్ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ సినిమా బిజీలో ఉన్నాను.

ఈ సినిమాకు, కల్ట్ కి కలిపి రెండిటికి ఒకేసారి సక్సెస్ మీట్ పెడతాను అని అన్నారు. మరి విశ్వక్ సరదాగా అన్నాడో, కౌంటర్ వేశాడో తెలీదు కానీ ఫ్లాప్ సినిమాకు సక్సెస్ మీట్ అనడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

 

మీకు నచ్చవచ్చు: నయనతారకి మదర్ థెరిస్సాకి ఉన్న సంబంధం ఏంటి!
మీకు నచ్చవచ్చు: ధనుష్ ఫ్యాన్స్ vs అనిరుద్

 

[Vishwak Sen, Cult, Ene Repeat, Tharun Bhackar]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com