TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబో: తెలుగు సినిమాకు మంచి రోజులు వస్తాయా.?

Nov 28, 2026 11:52AM

టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాలు పెరిగిపోయాయి. భారీ బడ్జెట్లు, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్‌తో సినిమాలు వస్తున్నాయి. కానీ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే పక్కా లోకల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్లు మాత్రం కొంతకాలంగా తగ్గిపోయాయి.

ఇలాంటి సమయంలో ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ కావడంతో.. అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై పడింది. ఎన్టీఆర్ స్వయంగా ఈ సినిమా ఒక ‘లాఫ్ రైట్’లా ఉంటుందని చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

ఎన్టీఆర్‌కు కామెడీ కొత్త కాదు. ‘అదుర్స్’, ‘బాద్‌షా’ సినిమాల్లో ఆయన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించారు. అయితే గత కొన్నేళ్లుగా ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’, ‘వార్ 2’ వంటి భారీ యాక్షన్ సినిమాలలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే మరో భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్‌ను మళ్లీ పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌లో చూడాలనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.

మరోవైపు అనిల్ రావిపూడి సినిమాలంటే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ గుర్తుకొస్తాయి. ‘ఎఫ్2’, ‘భగవంత్ కేసరి’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి సినిమాలతో ఆయన తనకంటూ ఒక కమర్షియల్ స్టైల్‌ను ఏర్పరుచుకున్నారు. ముఖ్యంగా సంక్రాంతి ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించడంలో అనిల్‌కు మంచి గుర్తింపు ఉంది.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌లో ఆ యాంగిల్.. పదేళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌.!

ఇటీవల గోవాలో జరిగిన 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్' కార్యక్రమంలో కూడా ఎన్టీఆర్‌తో సినిమా గురించి అనిల్ రావిపూడి ఆసక్తికరంగా మాట్లాడారు. ఎన్టీఆర్ స్టార్డమ్, అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అదే సమయంలో ఆయనలోని కామెడీ యాంగిల్‌ను కూడా ఉపయోగించుకుంటూ, న్యూట్రల్ ఆడియన్స్ కూడా మెచ్చేలా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పుడు తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా మార్కెట్, ఇతర భాషల ప్రేక్షకులు అనే ఆలోచన ఎక్కువైంది. కానీ మన తెలుగు ప్రేక్షకులకు తెలిసిన కుటుంబ వాతావరణం, మన కామెడీ, మన ఎమోషన్స్‌తో సినిమా తీస్తే కూడా థియేటర్లలో మంచి ఆదరణ దక్కుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. ‘ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి’ సినిమా అలాంటి ప్రయత్నం అవుతుందా? తెలుగు కమర్షియల్ సినిమాలకు కొత్త ఊపునిస్తుందా? అన్నది చూడాలి.

మీకు నచ్చవచ్చు: 
జపాన్‌లో లెనిన్ రిలీజ్.. ప్రభాస్, ఎన్టీఆర్ రేంజ్‌కి అఖిల్ వెళ్తాడా.?
బాలకృష్ణకు సుమలత క్షమాపణలు.. ఆ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా.?

 

 

 

[Jr NTR, Anil Ravipudi, Tollywood, Commercial Cinema, Pan India]

 

google-ad-img