TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

‘కాకా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. మరి ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి.?

Nov 28, 2026 11:16AM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా గందరగోళం నెలకొంది. ఈ సినిమా వాయిదా పడుతుందని, ఏప్రిల్ 7న విడుదల చేయాలని చూస్తున్నారని వార్తలు వచ్చాయి. మరోవైపు చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ రెండు సినిమాల్లో సంక్రాంతి బరిలో ఏది నిలుస్తుందనే ఆసక్తి పెరిగింది.

అయితే తాజాగా ‘కాకా’ చిత్రబృందం మరోసారి విడుదల తేదీపై స్పష్టత ఇచ్చింది. ముందుగా ప్రకటించినట్లుగానే 2027 జనవరి 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించింది. దీంతో ‘కాకా’ వాయిదా పడుతుందనే ప్రచారానికి టీమ్ చెక్ పెట్టినట్లయింది.

రచయిత కోన వెంకట్ కూడా ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. తమ లక్ష్యం, దృష్టి, ప్లాన్ అన్నీ జనవరి 13నే అని పేర్కొంటూ.. కొత్త ఆన్-లొకేషన్ చిరంజీవి, బాబీతో కలిసి ఉన్న ఫోటోను కోన పోస్ట్ చేశారు. మరోవైపు దర్శకుడు బాబీ కూడా ఆ ఫొటోను షేర్ చేస్తూ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు. ‘47 డేస్ టు కాకా’ అంటూ సంక్రాంతి రిలీజ్‌పై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘కాకా’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి సత్యం అనే పాత్రలో కనిపించనున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇది కూడా చదవండి: మెగా ట్విస్ట్.. వారణాసి రిలీజ్ డేట్‌కి కాకా.!

మొత్తానికి ‘కాకా’ టీమ్ జనవరి 13 విడుదల విషయంలో వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేసింది. దీంతో ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది.

మరి ‘విశ్వంభర’ కూడా సంక్రాంతి సీజన్ లోనే విడుదలై సర్ప్రైజ్ చేస్తుందా? లేక మరో కొత్త విడుదల తేదీని చూసుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

మీకు నచ్చవచ్చు: 
సందీప్ రెడ్డి వైరల్ కామెంట్స్.. హాలీవుడ్ స్టార్స్‌ కంటే చిరంజీవి గొప్ప.!
RC17 కాస్టింగ్ కాల్.. రామ్ చరణ్ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్.!

 

 

 

[Chiranjeevi, Kaaka Movie, Sankranthi Release, Vishwambhara]

 

google-ad-img