Home

»

Gossips

‘వారణాసి’లో హాలీవుడ్ నటి: మహేష్‌తో రొమాన్స్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరు.?

Oct 4, 2026 4:27PM

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై రోజుకో కొత్త వార్త బయటకు వస్తోంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి భారీ తారాగణంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు ఈ లైనప్‌లో హాలీవుడ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది.

బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్-జోన్స్ ‘వారణాసి’లో నటిస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అంతేకాదు.. సినిమాలో మహేష్ బాబుతో ఆమెకు కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

రాజమౌళి గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ సరసన జెన్నీ పాత్ర కోసం డైసీ ఎడ్గర్-జోన్స్ పేరు మొదట  వినిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌లో ఆమె నటించలేదు. ఆ పాత్రలో చివరకు ఒలివియా మోరిస్ కనిపించారు.

ఇప్పుడు అదే డైసీ.. మహేష్ బాబుతో కలిసి ‘వారణాసి’లో కనిపించబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ మూవీ టైమ్ ట్రావెల్, అడ్వెంచర్, భారతీయ పురాణాల అంశాలను కలిపిన భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. మహేష్ బాబు ఇందులో రుద్ర పాత్రతో పాటు శ్రీరాముడి పాత్రలో కూడా కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా నటిస్తున్నారు. 

ఇప్పటికే ‘వారణాసి’ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2027 ఏప్రిల్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి: ‘భోగి’ టీజర్ అదిరిపోయింది.. శర్వానంద్‌లో ఇలాంటి యాక్షన్ ఎప్పుడూ చూడలేదు.!

 

 

 

[Daisy Edgar Jones In Varanasi, Daisy Edgar Jones, Varanasi Movie, Mahesh Babu, SS Rajamouli, RRR Movie, Jr NTR, Telugu Film News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com