
‘సరైనోడు’ వంటి మాస్ బ్లాక్‌బస్టర్ అందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌పై ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. ఈ కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కూడా చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌కు సంబంధించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డిస్కషన్స్ దశలోనే ఉందని చెబుతున్నారు. ఇంకా అధికారికంగా ఏమీ ఫైనల్ కాలేదు.
గతంలోనూ గీతా ఆర్ట్స్‌లో బోయపాటి సినిమా గురించి వార్తలు వచ్చాయి. ‘సరైనోడు’ తర్వాత ఈ బ్యానర్ బోయపాటికి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. అల్లు అర్జున్‌తోనే మరో సినిమా చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే అది అప్పట్లో కార్యరూపం దాల్చలేదు.
ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారాయి. అల్లు అర్జున్ ‘పుష్ప’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను మరింత పెంచుకున్నారు. దీంతో బన్నీతో సినిమా చేయాలంటే కేవలం తెలుగు మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కాకుండా మరింత పెద్ద స్కేల్‌లో ఉండాల్సిన అవసరం ఉంది.
ఇదే సమయంలో బోయపాటి శ్రీనుకు కూడా ‘అఖండ’, ‘అఖండ 2’తో పాన్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ పెరిగింది. ఆయన సినిమాలకు హిందీలో డబ్బింగ్ ద్వారా మంచి గుర్తింపు ఉండటం కూడా ఈ కాంబినేషన్‌కు కలిసొచ్చే అంశంగా మారింది.

అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇది బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ సినిమా కాదట. అల్లు అర్జున్ సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ, బిగ్ స్కేల్ లో భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
గీతా ఆర్ట్స్ కూడా ప్రస్తుతం వరుసగా సినిమాలు నిర్మించడం కంటే పెద్ద, క్వాలిటీ ప్రాజెక్టులపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్-బాసిల్ జోసెఫ్ కాంబినేషన్‌తో పాటు బోయపాటి-బన్నీ కాంబో కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
అయితే ఇక్కడ మరోసారి చెప్పుకోవాల్సిన విషయం.. అల్లు అర్జున్-బోయపాటి సినిమా ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ప్రస్తుతం చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. కథ, స్కేల్, డేట్స్ వంటి అంశాలపై క్లారిటీ వచ్చిన తర్వాతే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ప్యారడైజ్ థియేటర్లలో మిస్సయింది.. ఓటీటీలో మాత్రం గూస్‌బంప్స్ గ్యారెంటీ.!
[Allu Arjun Boyapati Srinu Combo, Allu Arjun Next Movie, Boyapati Srinu Next Movie, Icon Star Allu Arjun, Boyapati Sreenu, Sarrainodu Movie, Geetha Arts, Telugu Film News]





