Home

»

Gossips

ఫస్ట్ టైమ్ అలాంటి పాత్రలో: లోకేష్ కనగరాజ్‌ సినిమాలో అల్లు అర్జున్ రోల్ ఇదే.!

Sep 29, 2026 4:50PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చేస్తుండగా.. ఆ తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు.

‘AA23’ వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోకేష్ కనగరాజ్ సినిమాలో అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పటివరకు బన్నీ ఫుల్ లెంగ్త్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించలేదు.

‘రేసుగుర్రం’లో మాత్రం కొంతసేపు పోలీస్ గెటప్‌లో కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు లోకేష్ సినిమాలో బన్నీని పవర్‌ఫుల్ కాప్‌గా చూపించబోతున్నారనే టాక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

లోకేష్ కనగరాజ్ సినిమాలంటే సాధారణంగా డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్స్, మాఫియా, యాక్షన్ ఎలిమెంట్స్ గుర్తొస్తాయి. అయితే పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలనే తన ఆసక్తిని లోకేష్ గతంలో వ్యక్తంపరిచారు. దీంతో లోకేష్.. అల్లు అర్జున్ కాంబినేషన్‌లోనే అలాంటి పోలీస్ స్టోరీ చేయబోతున్నాడా? అనే చర్చ మొదలైంది.

ఇది కూడా చదవండి: ఏమో ఏమో ఇది.. సరికొత్త లవ్ ఆంథమ్‌ వచ్చేసింది.!

 

 

 

[Allu Arjun Cop Role, Allu Arjun Police Role, Allu Arjun Role In AA23, AA23 Movie, Allu Arjun, Lokesh Kanagaraj, Anirudh Ravichander, Raaka Movie, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com