English | Telugu

Vrusshabha Review: మోహన్ లాల్ 'వృషభ' మూవీ రివ్యూ

Publish Date:Dec 25, 2025

  తారాగణం: మోహన్ లాల్, సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, అలీ, నేహా సక్సేనా తదితరులు డీఓపీ: ఆంటోనీ శాంసన్ ఎడిటర్: కె. ఎం. ప్రకాష్ సంగీతం: సామ్ సి.ఎస్ దర్శకత్వం: నంద కిషోర్ బ్యానర్స్:  కనెక్ట్ మీడియా, బాలాజీ మోషన్ పిక్చర్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్  విడుదల తేదీ: డిసెంబర్ 25, 2025    మలయాళ స్టార్ మోహన్ లాల్ కి తెలుగునాట కూడా మంచి గుర్తింపు ఉంది. ఆయన నటించిన పలు సినిమాలు ఇక్కడ మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు 'వృషభ' అనే ఫాంటసీ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పునర్జన్మల నేపథ్యం కావడం, ఇందులో మోహన్ లాల్ రాజుగా కనిపించడంతో.. 'వృషభ'పై ప్రేక్షకుల దృష్టి పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? (Vrusshabha Movie Review)    కథ: త్రిలింగ రాజ్య పాలకులైన 'వృషభ' వంశస్తులు శివుని సేవకులు. అత్యంత శక్తివంతమైన స్పటిక లింగానికి ఆ వంశం రక్షణగా నిలబడుతుంది. ఎందరో దుష్టులు ఆ స్పటిక లింగాన్ని దక్కించుకోవడానికి విఫలయత్నం చేస్తారు. ఒకసారి ఓ దుష్టుడికి శిక్షించే క్రమంలో రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్) వదిలిన బాణం కారణంగా అభంశుభం తెలియని పసివాడు మరణిస్తాడు. కళ్ళముందే బిడ్డను కోల్పోయిన తల్లి.. నీకు కూడా ఇదే గతి పడుతుందని రాజుని శపిస్తుంది. ప్రస్తుతంలో ఆది దేవ వర్మ(మోహన్ లాల్)ను ఆ గతం వెంటాడుతూ ఉంటుంది. దేవనగరి అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆది.. పెద్ద బిజినెస్ మేన్ గా ఎదుగుతాడు. అయితే అతనికి కలలో తరచూ వృషభకు సంబంధించిన సంఘటనలు కనిపిస్తుంటాయి. దీంతో తన తండ్రికి ఏమైందో తెలుసుకోవడానికి తేజ్(సమర్జిత్ లంకేష్) ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే తన తండ్రికి, తనకి ప్రాణహాని ఉన్న దేవనగరి గ్రామంలోకి అడుగుపెడతాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? అక్కడ ఆది దేవ వర్మకు వచ్చిన ఆపద ఏంటి? ఆది, తేజ్ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ: పునర్జన్మల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. 'వృషభ' కూడా ఆ కోవకు చెందినదే. మనకు పునర్జన్మల నేపథ్యంలో రాజుల కథ అంటే ముందుగా గుర్తుకొచ్చేది మగధీర. అందులో కథాకథనాలు కట్టిపడేస్తాయి. ఇప్పటికీ ఆ సినిమా చూస్తే.. చాలా సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. కానీ, 'వృషభ' మాత్రం ఆ దరిదాపుల్లో కూడా లేదు.   పూర్వ జన్మలో పెద్ద రాజు అయ్యుండి, ప్రస్తుత జన్మలో ఆ జ్ఞాపకాలు వెంటాడం అనేది మంచి కాన్సెప్టే. పైగా, ప్రాణంగా ప్రేమించే వ్యక్తే మన ప్రాణం తీయాలనుకుంటే.. ఆ బాధ వర్ణాతీతం. కథలో భారీతనానికి, భావోద్వేగాలకు రెండింటికీ మంచి స్కోప్ ఉంది. విజువల్స్ తో వావ్ అనిపించవచ్చు, అలాగే ఎమోషన్స్ తో కట్టిపడేయవచ్చు. కానీ, ఈ సినిమా విషయంలో ఆ రెండూ జరగలేదు.   త్రిలింగ రాజ్య పాలకుడిగా రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్) కథతో సినిమా ప్రారంభమవుతుంది. సెట్స్, విజువల్స్ తో మ్యాజిక్ చేయలేకపోయినప్పటికీ.. అంతో ఇంతో పరవాలేదు అనుకునే స్థాయిలో సినిమా ప్రారంభమైంది. అయితే ప్రస్తుతంలో సినిమా పూర్తిగా గాడి తప్పిపోయింది. తండ్రీకొడుకుల బాండింగ్ ని హత్తుకునేలా చూపించలేకపోయారు. నిజానికి ఫస్ట్ హాఫ్ లో ఆ బాండింగ్ ఎంతలా కనెక్ట్ అయితే.. సెకండాఫ్ కి అంత వెయిట్ వచ్చేది. కానీ, పునాదే సరిగ్గా లేకపోవడంతో ఆ ఎమోషన్ తో ప్రేక్షకులు పెద్దగా ట్రావెల్ కాలేరు.    ప్రేమ కథ కూడా ఏమాత్రం ఆకర్షణీయంగా లేదు. ఫస్ట్ హాఫ్ లో మొత్తంలో ఒక్క ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రమే సర్ ప్రైజ్ చేస్తుంది. సెకండాఫ్ లో ప్రస్తుతం కంటే గత జన్మ తాలూకూ కథను ఎక్కువగా చూపించడం కాస్త రిలీఫ్ అని చెప్పవచ్చు. అయితే రైటింగ్, మేకింగ్ పరంగా మాత్రం పెద్దగా  మ్యాజిక్ కనిపించదు. విజువల్స్, ఎమోషన్స్ అన్నీ ఆర్టిఫిషయల్ గానే అనిపిస్తాయి. క్లైమాక్స్ ని డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. అందుకు తగ్గట్టుగా ఫస్ట్ హాఫ్ లో మంచి సీన్స్ పడుంటే.. ఎమోషన్ వర్కౌట్ అయ్యుండేది.   సినిమాలో చాలా సీన్స్ ని డైలాగ్స్ తో నింపేశారు. ఆర్టిస్టులు వరుసగా డైలాగ్స్ చెబుతూ ఉంటారు. అలాగే, కథ కూడా అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది. మెజారిటీ సన్నివేశాలలో కొత్తదనం లేకపోవడంతో.. సినిమా నిడివి రెండు గంటలే అయినా చూసే ప్రేక్షకులకు బోర్ కలుగుతుంది.   నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: రాజా విజయేంద్ర వృషభ, ఆది దేవ వర్మ పాత్రల్లో మోహన్ లాల్ ఎప్పటిలాగే బాగానే రాణించారు. అయితే ఆ పాత్రలను మలిచిన తీరు, సన్నివేశాల్లో బలం లేకపోవడంతో.. ఆయన కష్టం వృధా అయింది. సమర్జిత్ లంకేష్ కూడా బాగానే నటించినప్పటికీ.. మోహన్ లాల్ ముందు తేలిపోయాడు. రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, అలీ, నేహా సక్సేనా తదితరులు పాత్రల పరిధి మేర నటించారు. కథకుడిగా, దర్శకుడిగా నంద కిషోర్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. మోహన్ లాల్ బ్రాండ్ ని క్యాష్ చేసుకోవడం కోసమే ఈ సినిమా తీసినట్టుగా ఉంది. సాంకేతికంగా కూడా సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. విజువల్స్ తేలిపోయాయి. సెట్స్ ఆర్టిఫీషియల్ గా ఉన్నాయి. ఆంటోనీ శాంసన్ కెమెరా పనితనం మ్యాజిక్ చేయలేకలేదు. సామ్ సి.ఎస్ మ్యూజిక్ కూడా జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా లేవు.   ఫైనల్ గా.. నిడివి తక్కువే ఉన్నప్పటికీ, నీరసం తెప్పించే సినిమా.. వృషభ.   రేటింగ్: 1.75/5    Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.  

Vrusshabha Movie Review

Publish Date:Dec 25, 2025

Cast: Mohanlal, Samarjit Lankesh, Nayan Sarika, Ragini Dwivedi, Neha Saxena, Ajay, Ali, Vinay Varma, Ayyappa P Sharma   Crew:  Written by Naandda Kishore, SRK, Janardhana Maharshi, Karthik Cinematography by Antony Samson Music by Sam C.S Edited by K. M. Prakash Directed by Naandda Kishore  Produced by Shobha Kapoor, Ekta Kapoor, C. K. Padma Kumar, Varun Mathur, Saurabh Mishra, Abishek S. Vyas, Praveer Singh, Vishal Gurnani, Juhi Parekh Mehta Mohanlal is one of the legendary actors and biggest stars of Indian Cinema. He has unlimited aura and has been in red hot form this year with big hits like L2:Empuraan, Thudarum, Hridayapoorvam. He even did a cameo in Bha Bha Ba alongside Dileep. Now, his long awaited Vrusshabha, a Malayalam - Telugu bilingual released Today. Latest discuss about the movie in detail.  Plot:  King Vijayendra Vrusshabha (Mohanlal) is the undisputed ruler of Trilingadesam, which is a divine abode of Lord Shiva's Spatika Lingam. Due to the energy produced by Lord, the entire kingdom is prosperous. An Asura clan attacks for Spatika Lingam and he defeats them along with his wife Trilochana Devi (Ragini Dwivedi). During the fight, Vrusshabha attacks a fleeing asura and accidentally, kills a young boy in front of his mother's eyes. She curses him that he too will lose his kid in front of his eyes.  Vrusshabha's son is born during a bad time and priest suggests huge homam to control the bad effects. But Vrusshabha is haunted by the image of the women who cursed him. Suddenly, his son is lost in Manasvini River during a festival. In recent times, Vrusshabha is reborn as businessman Aadi Deva Varma and his son Dev (Samarjit Lankesh) is ready give life for his Dad. But Aadi Deva is haunted again by his past life and his son starts a journey to find solution. He goes to his hometown and suddenly decides to kill his own father. Why he did so? What is the reason behind it all? Watch the movie to know more. Analysis:  Mohanlal is a great actor no doubt but he has a tendency to act in some forgettable roles and films. But he accepted this story while at the time, he is in red hot form. Hence, this feels like a big letdown by an actor and star of his calibre. Even his peformance is very basic and this is like sleep-walking from him. He is good in Vrusshabha King portions but not so in businessman portions.  Samarjit Lankesh is truely wooden in this role. Standing in front of an actor like Mohanlal, he needed to work more on his postures, dialogues, expressions. He is the leading hero and anti-hero of this film and it felt like a super downgrade to watch such an actor while watching Mohanlal. In fact, it is other way around, as all other actors are equally bad and wooden except for the legend and to an extent Ayyappa P Sharma.  Even production values, technical values are so bad that it looks like a TV movie. The sets and grandiose that the makers wanted to present on big screen is so amateur that you can see that the makers are trying to cheat with low quality sets as grand visuals. Each scene and frame are constructed so poorly that the audience member feel frustrated about the story progression. It never engages and every idea seems to be too silly to even be taken seriously.  Nanndda Kishore tried hard to convince us that the story has emotions that string our heart but the scenes are poorly written and executed that even children would not find it amusing to watch. On the whole, the movie is a complete misfire and only saving grace to an extent is Mohanlal's screen presence.  Bottomline:  A highly forgettable movie from Mohanlal.  Rating: 1.75/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

Champion Movie Review 

Publish Date:Dec 25, 2025

Shambhala Movie Review

Publish Date:Dec 24, 2025

ఎవరికీ తలొగ్గని భానుమతి.. ఓ సంగీత దర్శకుడికి పాదాభివందనం చేశారు.. ఎందుకో తెలుసా?

Publish Date:Dec 23, 2025

(డిసెంబర్ 24 భానుమతి వర్థంతి సందర్భంగా..) పాతతరం నటీమణుల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న భానుమతి గురించి అందరికీ తెలిసిందే. వివిధ శాఖల్లో విశేషమైన ఖ్యాతిని సంపాదించుకున్న ఆమె.. చిన్నతనంలో తండ్రి దగ్గర సంగీతాభ్యాసం చేశారు. ఆమె స్వరం చాలా విభిన్నంగా ఉంటుంది. సినిమా రంగంలో స్థిరపడిన తర్వాత ఎన్నో పాటలు పాటలు పాడారు. ఆమె పాటలకు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. అంతేకాదు, కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.   తిరుగులేని ఆత్మవిశ్వాసం, తనకు నచ్చని ఏ విషయాన్నయినా ఖండించడం అనేది భానుమతికి చిన్నతనం నుంచీ అబ్బిన లక్షణం. అందుకే అనవసర విషయాల గురించి ఆమె దగ్గర ప్రస్తావించేవారు కాదు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ వంటి స్టార్‌ హీరోలు కూడా ఆమెతో కలిసి నటించేందుకు భయపడేవారు. సినిమా రంగంలో ఇలాంటి లక్షణాలు ఉన్నవారు రాణించడం చాలా కష్టం. కానీ, భానుమతి మాత్రం దానికి అతీతంగా అద్భుతమైన విజయాలు సాధించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు.    ఎన్టీఆర్‌, భానుమతి జంటగా నటించిన మల్లీశ్వరి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావు. అప్పటి సంగీత దర్శకుల్లో రాజేశ్వరరావు ఓ విభిన్న వ్యక్తిత్వంతో ఉండేవారు. తను చేసే సంగీతం గురించి ఎవరైనా విమర్శించినా, సలహాలు ఇవ్వాలని చూసినా, తను చెప్పిన విధంగా గాయనీగాయకులు పాడకపోయినా ఆయనకు వెంటనే కోపం వచ్చేది. మారు మాట్లాడకుండా తన హార్మోనియం పెట్టెను తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేసేవారు. ఎంత పెద్ద హీరో, దర్శకనిర్మాతలైనా ఆయన ధోరణి అలాగే ఉండేది.    తనకు అసౌకర్యంగా ఉన్న వాతావరణంలో రాజేశ్వరరావు సంగీతం చేసేవారు కాదు. అలా సినిమా మధ్యలోనే వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మాయాబజార్‌ వంటి సినిమాలో నాలుగు పాటలు కంపోజ్‌ చేసిన తర్వాత నిర్మాతల ధోరణి నచ్చక ఆ సినిమా నుంచి బయటికి వచ్చేశారు. 'శ్రీకరులు దేవతలు..', 'లాహిరి లాహిరి లాహిరిలో..', 'నీ కోసమే నే జీవించునది..', 'చూపులు కలిసిన శుభవేళ..' పాటలు ఎస్‌.రాజేశ్వరరావు కంపోజ్‌ చేసినవే. మిగతా పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను ఘంటసాలతో చేయించారు. టైటిల్స్‌లో తన పేరు వేయకపోయినా రాజేశ్వరరావు బాధపడలేదు.    ఎన్టీఆర్‌ దర్శత్వంలో వచ్చిన దానవీరశూర కర్ణ చిత్రానికి మొదట అనుకున్న సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావు. అందులో ఒక పాట చేసిన తర్వాత ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమరావు పాటలు ఎలా ఉండాలి అనే విషయంలో రాజేశ్వరరావుకు సలహా ఇవ్వాలని చూశారు. ఆ క్షణమే ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లి 'మీ తమ్ముడికి సంగీత జ్ఞానం బాగా ఉంది. అతనితోనే మ్యూజిక్‌ చేయించుకోండి' అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ సినిమాలో ఎంతో పెద్ద హిట్‌ సాంగ్‌ అయిన 'ఏ తల్లి నిను కన్నదో..' పాట రాజేశ్వరరావు కంపోజ్‌ చేసిందే. ఆ తర్వాత పెండ్యాల నాగేశ్వరరావుతో మిగతా పాటలు చేయించుకున్నారు ఎన్టీఆర్‌.    ఇక 'మల్లీశ్వరి' సినిమాకి సంబంధించి మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నప్పుడు 'మనసున మల్లెల మాలలూగెనే..' పాటను ఎలా పాడాలో భానుమతికి చెబుతున్నారు రాజేశ్వరరావు. కానీ, కొన్ని సంగతులు ఆయన చెప్పినట్టు కాకుండా తనదైన ధోరణిలో పాడుతున్నారు భానుమతి. తను చెప్పినట్టుగా పాడితేనే పాట బాగా వస్తుందని, తేకపోతే పాట చెడిపోతుందని ఆయన చెప్పారు. కానీ, భానుమతి మాత్రం తను అనుకున్న విధంగానే పాడారు. పైగా తనకు కూడా సంగీత జ్ఞానం ఉంది అంటూ గుర్తు చేశారు. ఆమె అలా అనడంతో వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని బ్రతిమాలి తీసుకొచ్చారు. చివరికి రాజేశ్వరరావు ఎలా పాడమన్నారో అలాగే పాడారు భానుమతి.    రికార్డింగ్‌ పూర్తయిన తర్వాత యూనిట్‌ సభ్యులతో కూర్చొని ఆ పాటను విన్నారు భానుమతి. ఆ పాటను రాజేశ్వరరావుగారు అలా ఎందుకు పాడమన్నారో ఆమెకు అప్పుడు అర్థమైంది. క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆయన దగ్గరకు వెళ్లి పాదాభివందనం చెయ్యబోయారు. కానీ, రాజేశ్వరరావు వారించారు. 'మీరు పాటను అలా ఎందుకు పాడమన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి' అని రాజేశ్వరరావుకు నమస్కారం చేశారు భానుమతి.

దృశ్యం3కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది

Publish Date:Dec 22, 2025

ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో సిరీస్ వ‌చ్చాయి. వాటిలో దృశ్యం సిరీస్‌కి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటూనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే రెండు భాగాలు రిలీజ్ అయి మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. దృశ్యం చిత్రానికి సంబంధించిన రెండు పార్టులు మ‌ల‌యాళం, తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందాయి. ఈ చిత్రానికి సంబంధించిన మూడో భాగం మాత్రం మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోంది. ఇటీవ‌లికాలంలో హిందీలో మంచి విజ‌యాన్ని సాధించిన సిరీస్ ఇదే కావ‌డం విశేషం. ప్రస్తుతం మ‌ల‌యాళం, హిందీ వెర్ష‌న్ల‌కు సంబంధించిన షూటింగ్స్ జ‌రుగుతున్నాయి. మ‌ల‌యాళ వెర్ష‌న్‌కు జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, హిందీ వెర్ష‌న్‌ను అభిషేక్ పాఠక్ రూపొందిస్తున్నారు.    ఇదిలా ఉంటే.. దృశ్యం3 హిందీ వెర్ష‌న్‌కి సంబంధించి రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అజ‌య్‌దేవ్‌గ‌ణ్ వాయిస్ ఓవ‌ర్‌తో న‌డిచే ఈ వీడియోలో దృశ్యం 3 ఎలా ఉండబోతోంది అనేది ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026 అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ మూడో భాగంతో దృశ్యం క‌థ ముగుస్తుంద‌ని తెలుస్తోంది. స్టార్ స్టూడియో18 సమర్పణలో, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను అభిషేక్ పాఠక్, ఆమిల్ కీయాన్ ఖాన్, పర్వీజ్ షైఖ్ కలిసి అందించారు. అలొక్ జైన్, అజిత్ అందారే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన రెండు భాగాల మాదిరిగానే మూడో భాగం కూడా ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని బాలీవుడ్ ట్రేడ్‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. 

బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు ఆదినా సుధీరా ? ఎంఎల్ఏగా ఆది ఆ జిల్లా నుంచి పోటీ

Publish Date:Dec 25, 2025

2025 కొన్ని రోజుల్లో బైబై చెప్పేయబోతోంది. డిసెంబర్ 31st రావడానికి ఎన్నో రోజులు లేదు. ఇక ఈ సందర్భంగా కం 2 ఢీ పార్టీ పేరుతో ఈటీవీ న్యూ ఇయర్ ఈవెంట్ జరపబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో జాఫర్ కనిపించాడు. లాస్ట్ లో ఆదిని, సుధీర్ ని కూర్చోబెట్టి కొన్ని ప్రశ్నలు వేసాడు. "ఆది ఒక్కోసారి షోలో వేసే పంచులు వలన అవతలి వారి మనోభావాలు దెబ్బతింటాయని తెలిసిన పట్టించుకోని పరిస్థితి ఉండదా" అని ఆదిని అడిగాడు. "అవన్నీ ఉండవండి మన దగ్గర" అని ఆన్సర్ ఇచ్చాడు. "ఎంఎల్ఏగా ఎప్పుడు ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు..ఆది నాకు ఆ సమాచారం ఉంది" అని అన్నాడు జాఫర్. జిల్లా పేరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తన మనసులో భావాన్ని పరోక్షంగా చెప్పిన ఆది అన్నాడు జాఫర్. ఐతే ఇంతకు ఏ జిల్లా అనే పేరు మాత్రం ప్రోమోలో వినిపించనివ్వలేదు. "ఈ మధ్య మీరు ఒక లవ్ స్టోరీ నుంచి బయటకు వచ్చారు. ఏంటి కావ్య రీజన్" అంటూ కావ్యని కూడా ఎన్కౌంటర్ చేసాడు.   ఇక ప్రోమో స్టార్టింగ్ లో బ్రేకింగ్ న్యూస్ అంటూ జాఫర్ వచ్చి "ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే టాపిక్ హూ ఈజ్ ది బెస్ట్ ఎంటర్టైనర్ ఆదినా సుధీర్ ఆ అని" అడిగాడు. ఈ ప్రశ్నకు నెటిజన్స్ ఐతే సుధీర్ పేరును ఎక్కువగా మెన్షన్ చేశారు. అలాగే కొంతమంది సుధీర్ ని కొంతమంది ఆదిని ఉద్దేశిస్తూ రిప్లైస్ ఇచ్చారు. అలాగే ఈ ఇద్దరి కంబినేషన్ కూడా బాగుంటుంది అంటూ కూడా చెప్పాడు. "సుధీర్ అన్న యాంకర్ గా ఉన్నా అభిమానిస్తాం, హీరోగా ఉన్నా అభిమానిస్తాం, కమెడియన్ గా ఉన్నాఅభిమానిస్తాం, మాకు కావాల్సింది కేవలం సుధీర్ అన్న మాత్రమే, ఆది అన్న  కామెడీ కింగ్' అంటూ నెటిజన్స్ వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు.

బ‌న్నీ, లోకేష్ కాంబినేష‌న్‌లో సినిమా.. మ‌రి త్రివిక్ర‌మ్ మాటేమిటి?

Publish Date:Dec 25, 2025

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ కాంబినేష‌న్‌లో ఓ హై టెక్నిక‌ల్ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో పూర్త‌య్యే అవ‌కాశం ఉంది. అయితే ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ చేయ‌బోయే సినిమా గురించి ఇప్ప‌టి నుంచే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల త‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌ను ముగించుకొని హైద‌రాబాద్ వ‌చ్చిన బ‌న్నీని త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ క‌లిశారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఉంటుంద‌ని చాలా కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి.  తాజాగా జ‌రిగిన బ‌న్నీ, లోకేష్ మీటింగ్ ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది. వీరి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌నే ప్ర‌చారానికి బ‌లం చేకూరింది. అదే నిజమైతే అట్లీ సినిమా పూర్తి కాగానే లోకేష్ ప్రాజెక్ట్‌కి ముహూర్తం నిర్ణ‌యించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్స్ ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. దాంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి.  ఇదిలా ఉంటే.. త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో బ‌న్నీ చేయ‌బోయే సినిమాపై ఒక క్రేజీ అప్‌డేట్ బ‌య‌టికి వ‌చ్చింది. ఇప్ప‌టికే జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి. మూడో సారి వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే మ‌ధ్య‌లో ఎన్టీఆర్ పేరు వినిపించింది. తాజా స‌మాచారం మేర‌కు ఈ ప్రాజెక్ట్ మ‌ళ్లీ బ‌న్నీ ద‌గ్గ‌రికే వ‌చ్చింద‌ట‌. పురాణాల ఆధారంగా కార్తికేయుడి కథతో త్రివిక్రమ్ ఒక భారీ సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేశార‌ట‌. అయితే లోకేష్‌, త్రివిక్ర‌మ్‌.. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రి సినిమా మొద‌ట స్టార్ట్ అవుతుంద‌నేది తెలియాల్సి ఉంది. 

Is Suriya's Karuppu looking to compete with Dhurandhar 2?

Publish Date:Dec 20, 2025

Suriya starrer Karuppu being directed by RJ Balaji has been struggling with financial issues even though movie is 95% complete. A song and few scenes needs to be shot and the makers are planning to complete the shoot in January. Now, the makers are planning to release on 19th March 2026.  Already, the movie has been facing huge troubles with low asking price from OTT platforms which makers are not happy with. Suriya has been facing huge downtime in his career, so he is expecting Karuppu to be his major comeback at the box office. Meanwhile, he moved on to his next Suriya46 with Venky Atluri.  Sithara Entertainments is producing the film and Mamitha Baiju is playing a leading role in it. The makers have wrapped up shoot completely and they have started post-production works locking May date. Hence, Karuppu cannot go for a further date than Atluri's film.  Meanwhile, Jithu Madhavan's cop film with Suriya will complete shoot by May and the actor, who is producing it himself, doesn't want to take it to 2027, unless works are pending or slowed down it seems.   So, Karuppu makers need to lock March date and so, despite competition with Dhurandhar and Yash's Toxic, they might for the date, say sources. With Dhurandhar being such a massive hit, Part-2 will shatter all box office records in opening weekend for sure. Going against it would be a suicide but makers have no choice, it seems. Let's wait for official confirmation.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

అఖండ 2

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969