English | Telugu

మిడ్ నైట్ మసాలా కోసం తాగుబోతు రమేష్ గొడవ!

జబర్దస్త్ ఎవ్రీ వీక్ ఏదో ఒక విధంగా నవ్వులు కురిపించడానికి ట్రై చేస్తోంది. కానీ ఇంతకు ముందు ఉన్న ఫన్, కామెడీ ఐతే ఉండడం లేదు..కానీ స్కిట్స్ మధ్యలో ఈ మూవీ ప్రొమోషన్స్ టీమ్స్ వస్తూండేసరికి వాళ్ళ వలన కొంచెం కామెడీ అనేది కవర్ అవుతోంది. ఇక ఈ వారం కూడా అలాగే జరిగింది. జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి "నారాయణ అండ్ కో" టీం ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ముందుగా రాకెట్ రాఘవ స్కిట్ పెర్ఫార్మ్ చేసాడు. వీళ్ళ టీం మొత్తం జెపిల్ ఆడారు. ఐతే జెపిఎల్ అంటే జబర్దస్త్ ప్రీమియర్ లీగ్ అని కూడా క్లారిటీ ఇచ్చాడు రాఘవ. టాస్ వెయ్యి అని రాఘవ అనేసరికి "తడా, పొడా" అని నాగి కౌంటర్ వేసాడు. ఛి ఏమిటా మాటలు ..మనమేమన్నా చింత చెట్ల కింద ఆడుతున్నామా  అన్నాడు రాఘవ.

అవినాష్ పరువు తీసిన శ్రీముఖి!

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈసారి ఎపిసోడ్ కి బీబీ జోడి టాప్ 5 జోడి కంటెస్టెంట్స్ వచ్చారు. వీళ్ళ డాన్సులు, పంచ్ డైలాగ్స్ నవ్వు తెప్పించాయి. పటాస్ ఫైమా వచ్చి షోని తన స్టైల్లో యాంకరింగ్ చేసి స్టార్ట్ చేసింది. రా అక్కా ఇంకా చూస్తావేంటి "ఫైమా కొట్టింది కప్పు ...నువ్వొచ్చి కొట్టు డప్పు" అని హోస్ట్ శ్రీముఖిని పిలిచింది. శ్రీముఖి రావడంతోనే సెలెబ్రేషన్స్ దేనికి అని అడిగింది "బీబీ జోడి విన్నర్ ఇక్కడ" అని ఫైమా ఆన్సర్ చేసింది. "ఈ ప్రోగ్రాంకి మాత్రమే హోస్ట్ ని కాదు ఈ పార్టీకి కూడా హోస్ట్ ని నేను" అని చెప్పింది శ్రీముఖి.  "ఈరోజు పార్టీ ఫ్రీ..డబ్బులు కట్టకుండా ఎంతైనా ఫ్రీగా తిని వెళ్లొచ్చు" అని అనౌన్స్ చేసేసరికి అవినాష్, ఎక్స్ప్రెస్ హరి స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చి పిచ్చి డాన్స్ ఒకటి చేశారు. "నీ ముఖంలో రన్నర్ ఐన బాధకన్నా కూడా ఫ్రీగా ఫుడ్ దొరుకుతోంది అన్న ఆనందమే ఎక్కువగా కనిపిస్తోంది..సిగ్గుండాలి మనిషన్నాకా " అని శ్రీముఖి అవినాష్ పరువు తీసేసింది.

రుద్రాణి చెప్పిన మాస్టర్ ప్లాన్ ఏంటి.. స్వప్నకి మళ్ళీ పెళ్ళిచూపులు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -82 లో.. కావ్య టీ తీసుకొని వచ్చి అందరికి ఇస్తుంటే.. రాజ్ మాత్రం తీసుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. రాజ్ వెనకాల కావ్య టీ పట్టుకొని వెళ్లి తనకి ఇస్తుంటే.. రాజ్ కోప్పడతాడు. ఇంట్లో అందరిని నీ వైపుకి తిప్పుకుంటున్నావ్.. ఇంట్లో మా అమ్మా గౌరవంగా ఉండేది.. నువ్వు వచ్చాక అది తగ్గిపోతుంది.. మా అమ్మకి నేను కూడా రివర్స్ మాట్లాడుతున్నాను.. ఇదంతా నీ వల్లే.. ఎంత మందిని నీ వైపుకి తిప్పుకున్నా నువ్వు చెప్పిన గడువులోపు ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకుంటేనే ఈ ఇంట్లో ఉంటావు లేకుంటే బయటకు గెంటేస్తానని కావ్యతో రాజ్ అంటాడు. రాజ్ అనే మాటలన్ని మౌనంగా వింటుంది.

అమ్మ కోసం ఒక నెక్లెస్ కొన్న దీపికా

దీపికా రంగరాజు అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఎవరికీ తెలీదు కానీ "బ్రహ్మముడి" సీరియల్ లో కావ్య అంటే చాలు బొమ్మలకు రంగులేసే అమ్మాయిగా యిట్టె గుర్తోచేస్తుంది. తమిళనాడు చెన్నైలో పెరిగిన దీపికా  న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తమిళ్ మూవీ "ఆరడి"లో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత తమిళ సీరియల్ 'చితిరం పెసుతడి' తో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి రీమేక్ గా వస్తున్న బ్రహ్మముడి సీరియల్ లో ఇప్పుడు ఈమె నటిస్తోంది. ఇక ఈ సీరియల్ టాప్ 1 పొజిషన్ లో రేటింగ్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దీపికా తన యుట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో అప్ లోడ్ చేసింది. వాళ్ళ అమ్మ కోసం గోల్డ్ కొని సర్ప్రైజ్ చేసింది. ఐతే చెన్నై ఫస్ట్ హోమ్ అని హైదరాబాద్ సెకండ్ హోమ్ ఐపోయింది అని చెప్పింది.

అతడిని చూసి పొరపడిన వసుధార.. ధరణి కన్నీటి పర్యంతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్  గురువారం నాటి ఎపిసోడ్ -748 లో.. శైలేంద్ర దగ్గరికి ధరణి కాఫీ తీసుకొని వెళ్ళినట్టుగా అతను ప్రేమగా కాఫీ బాగుందని చెప్పినట్టుగా కల కంటుంది ధరణి. నిజానికి కాఫీ తెచ్చిన ధరణిపై కోప్పడతాడు శైలేంద్ర. ఎలా ఉన్నావ్.. ఇంట్లో అద్దం ఉంది కదా ఎప్పుడైనా చూసుకున్నావా? కాఫీ  మాత్రమే బాగుంది.. నువ్వు అస్సలు నచ్చలేదు.. నాకు ఇలా ఉంటే నచ్చదని శైలేంద్ర అంటాడు. అప్పుడే అక్కడికి దేవయాని వచ్చి.‌ నేను కూడా అదే చెప్తాను.. అసలు వినదంటూ ఇంకా గొడవ పెట్టాలని చూస్తుంది. ధరణి కళ్ళ నిండా నీళ్లతో బాధని అణుచుకొని కిందకి వెళ్ళిపోతుంది. అలా ధరణి బాధపడుతూ కన్నీటితో రావడం జగతి, మహేంద్రలు గమనిస్తారు. 

బిగ్ బాస్-7లోకి ఉదయభాను వెళ్ళనుందా!

యాంకర్ ఉదయభాను.. ఈ పేరు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఒక్కప్పుడు ఏ సినిమా ఆడియో ఫంక్షన్ అయిన  ఉదయభాను ఉండాల్సిందే.‌ ఏ షో అయిన తను సందడి చెయ్యాల్సిందే అన్నట్లుగా ఉదయభాను క్రేజ్ ఉండేది. ఒకప్పుడు అన్ని ఛానెల్లకు మోస్ట్ ఛాయస్ గా ఉదయభాను ఉండేది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను సంపాదించుకుంది. లీడర్ లో 'రాజశేఖర ' సాంగ్ లో కన్పించిన ఉదయభాను, ఆ తర్వాత జులాయి మూవీలో  ఐటమ్ సాంగ్ లో మళ్ళీ మెరసింది. అప్పట్లో రెండు మూడు సినిమాల్లో కనిపించి అందరిని మెప్పించింది. ఉదయభాను పెళ్లి చేసుకొని ఇద్దరి కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా కొంత కాలం బుల్లి తెరకి దూరంగా  ఉంది.

తన వంటతో దుగ్గిరాల కుటుంబాన్ని మెప్పించిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-81 లో.. అప్పుని బయట ఒక దగ్గర కళ్యాణ్ రహస్యంగా కలిసి మాట్లాడుతుంటాడు. అనవసరంగా చెయ్యని తప్పుకి కావ్య వదిన  శిక్ష  అనుభవిస్తుంది.. ఎలాగైనా మీ స్వప్న అక్క ఎవరితో లేచిపోయిందో కనుక్కోవాలని కళ్యాణ్ అనగానే.. మీ కుటుంబంలో గొడవలు పెట్టె వాళ్లే ఉన్నారనుకున్నాను.. ఇలా కూడా ఆలోచించేవాళ్ళున్నారా అని అప్పు అంటుంది. ఇక కళ్యాణ్ చెప్పిన దానికి అప్పు సరే అంటుంది. ఎలాగైనా స్వప్నని రెచ్చగొట్టేలా మాట్లాడితే తానే వెళ్ళిపోతుందని కళ్యాణ్ ఐడియా ఇస్తాడు.