వినాయక్ కి ఏమైంది.. ఇంత పెద్ద విషయాన్ని సీక్రెట్ గా ఉంచారా!
ఒకప్పుడు వి. వి. వినాయక్ (VV Vinayak) దర్శకత్వంలో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడేవారు. వినాయక్ దర్శకత్వంలో 'ఆది', 'దిల్', 'ఠాగూర్', 'బన్నీ', 'లక్ష్మి', 'కృష్ణ', 'అదుర్స్' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాంటి వినాయక్ కొంతకాలంగా రేస్ లో వెనకబడిపోయారు. గత ఆరేళ్లలో ఆయన నుంచి రెండే సినిమాలు వచ్చాయి. 2018 వచ్చిన 'ఇంటిలిజెంట్' ఫ్లాప్ కాగా, కొంచెం గ్యాప్ తీసుకొని చేసిన 'ఛత్రపతి' హిందీ రీమేక్ కూడా గతేడాది విడుదలై చేదు ఫలితాన్ని మిగిల్చింది.