రాజమౌళి శిష్యుడే విక్రమార్క తీసాడు..అగస్ట్ 30 న అన్ని బయటకి వస్తాయి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 2009 లో వచ్చిన మూవీ మగధీర.ఇందులో రణదేవ్ బిల్లా అనే కరుడుగట్టిన విలనిజంతో ప్రేక్షకులని మెప్పించిన నటుడు దేవ్ గిల్. ఆ తర్వాత పూల రంగడు, రగడ, రచ్చ, ప్రేమ కావాలి, నాయక్ వంటి చిత్రాల్లో మెరిశాడు. తమిళ, మలయాళ, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోను చాలా చిత్రాలు చేసాడు. ఇప్పుడు సోలో హీరోగా రూటు మార్చాడు. దీంతో సోషల్ మీడియాలో ప్రత్యేక అతిధిగా ల్యాండ్ అయ్యాడు.