నవీన్ చంద్ర కోసం రంగంలోకి దిగిన కాజల్ అగర్వాల్!
నవీన్ చంద్ర(Naveen Chandra) లీడ్ రోల్ లో నటిస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ 'ఇన్స్ పెక్టర్ రిషి'(Inspector Rishi). సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ క్రైమ్ కథతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు డైరెక్టర్ నందిని జె.ఎస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. అమెజాన్ తమిళ్ ఒరిజినల్ గా "ఇన్స్ పెక్టర్ రిషి" ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది.